Niranjan Reddy | రేవంత్ పాలమూరుకొచ్చి పచ్చి అబద్దాలు చెప్పిండు
Niranjan Reddy | పాలమూరుపై రేవంత్ రెడ్డికి ఇసుక రేణువు అంత ప్రేమ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వాపస్ వచ్చిన డీపీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
- రేవంత్‌రెడ్డికి ఇసుక రేణువంత ప్రేమ లేదు
- రెండున్నరేళ్ల తర్వాత ఆయనకు టైం దొరికింది
- వాపస్ వచ్చిన డీపీఆర్ గురించి ఎందుకు మాట్లాడవ్
- తెలంగాణకు శాశ్వత ద్రోహి కాంగ్రెస్
- మీడియా సమావేశంలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్: పాలమూరుపై రేవంత్ రెడ్డికి ఇసుక రేణువు అంత ప్రేమ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కేసులు వేయించిందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో భూ సేకరణ 300 ఎకరాలు మాత్రమే మిగిలిందని చెప్పారు. వాపస్ వచ్చిన డీపీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కాలమే అన్నింటికి సమాధానం ఇస్తుందని.. సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఈమేరకు ఆయన తెలంగాణ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.
రెండున్నరేళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సమయం దొరికింది. గాలి మోటారులో వచ్చి పాలమూరు ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పారు. జూరాల ఉమ్మడి పాలమూరు సాగునీటి అవసరాలకు తీర్చడానికి ఉపయోగపడదు. తెలంగాణకు శాశ్వత ద్రోహి కాంగ్రెస్. పాలమూరుకు చారిత్రక ద్రోహి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పాలనలో నీళ్ల గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. పాలమూరులో జీవ నదులు ఉన్నా కరువు జిల్లాగా మార్చారు. జూరాల పూర్తి చేయడానికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు 40 ఏండ్లు సమయం తీసుకున్నాయి అని ఆయన ఎద్దేవా చేశారు.
65 టీఎంసీల నీళ్లు వచ్చేలా ఒప్పందం...
కల్వకుర్తికి బీఆర్ఎస్ హయాంలో 3 వేల కోట్లు ఖర్చు పెట్టాం. మద్రాసు, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం తుంగభద్ర నుంచి పాలమూరుకు 65 టీఎంసీల నీళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం ఉంది. కేసీఆర్‌ను అవమానించే విధంగా మాట్లాడి గొప్పోడిని కావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో తిరగండి అని సింగిరెడ్డి సవాల్ చేశారు.
ఎన్‌వోసీ ఇయ్యడానికి చంద్రబాబు ఎవరు?
తెలంగాణను ఎప్పుడు ప్రశాంతంగా ఉంచారు. ఏపీ ప్రభుత్వం కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియరెన్స్ లు తెచ్చింది. చంద్రబాబు ఎన్‌వోసీ ఇస్తే తెలంగాణకు నీళ్లు తెస్తావా రేవంత్ రెడ్డి? ఎన్‌వోసీ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎవరు? చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పని చేసిన వ్యక్తి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారే. ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి జూరాలకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నాయి. కృష్ణా నదిలో ఈ ఏడాది తక్కువ నీటి వినియోగం జరిగింది అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
వైఎస్ తెలంగాణ వ్యతిరేకి..
పాలమూరు, రంగారెడ్డిలో 90 టీఎంసీలు ఉంటే 45 టీఎంసీలు చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పరిపాలన చేయడానికి ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారా? రేవంత్ ఏం మాట్లాడినా అది మీది మీకే రివర్స్ అవుతుంది. మేం రాజశేఖర్ రెడ్డిని మోడల్‌గా తీసుకోం. వైఎస్ తెలంగాణ వ్యతిరేకి. వైఎస్ రాజకీయ ప్రస్థానాన్ని గౌరవిస్తాం. భట్టిని దృష్టిలో ఉంచుకుని పంచె కట్టు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని నిరంజన్‌రెడ్డి అన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
- ●Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!
- ●Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామల
- ●RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ

Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా

WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..

WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!





