త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Travels Bus | కేపీహెచ్‌బీలో ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు ద‌గ్ధం.. ప్ర‌యాణికులు క్షేమం

Travels Bus | హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) వద్ద ఒక ప్రైవేట్ బ‌స్సు (Travels Bus) అగ్నికి ఆహుత‌య్యింది. శుక్ర‌వారం రాత్రి శ్రీదుర్గా మ‌హేశ్వ‌రి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీప‌ర్ బ‌స్సు మియాపూర్ నుంచి ఏపీలోని పాల‌కొల్లు వెళ్తున్న‌ది.

G

Hyderabad | Published On Apr 18, 2026, 6.06 am IST

Travels Bus | కేపీహెచ్‌బీలో ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు ద‌గ్ధం.. ప్ర‌యాణికులు క్షేమం
Advertisement

Travels Bus | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) వద్ద ఒక ప్రైవేట్ బ‌స్సు (Travels Bus) అగ్నికి ఆహుత‌య్యింది. శుక్ర‌వారం రాత్రి శ్రీదుర్గా మ‌హేశ్వ‌రి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీప‌ర్ బ‌స్సు మియాపూర్ నుంచి ఏపీలోని పాల‌కొల్లు వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో కేపీహెచ్‌బీ స‌మీపంలోని ప‌ద్మావ‌తి ప్లాజా బ‌స్‌స్టాప్ వ‌ద్ద ఆగింది. రాత్రి 10.45 గంట‌ల స‌మ‌యంలో డ్రైవ‌ర్ క్యాబిన్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి బ‌స్సుమొత్తం వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది బ‌స్సులో ఉన్న 18 మంది ప్ర‌యాణికుల‌ను దించివేశారు. చూస్తుండగానే బ‌స్సు కాలి బూడిద‌యింది.

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి ట్రాఫిక్ సీఐ జానయ్య, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

Advertisement
Advertisement