Trainee IPS Uday Krishna Reddy | ‘నా చావుకు కారణం వాళ్లే’ : బయటపడ్డ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్..!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సదరు మహిళా అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంక్షిప్త సారాంశం
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో సంచలన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా అధికారిణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో అకాడమీ ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తన చావుకు సదరు మహిళా అధికారిణి, ఆమె భర్త, ఇద్దరు స్నేహితులే కారణమంటూ ఉదయ్ తన లేఖలో ఆరోపించారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన ఉదయ్ నిర్దోషి అని, వీడియో ఆధారాలు తన మొబైల్‌లో ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Trainee IPS Uday Krishna Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తోటి మహిళా అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, అకాడమీ విచారణ, సస్పెన్షన్, ఆత్మహత్యాయత్నం.. ఇలా వరుస పరిణామాలతో కలకలం రేపిన ఈ కేసులో తాజాగా ఓ 'సూసైడ్ నోట్' (Suicide Note) వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
వేధింపుల కేసు.. ఆత్మహత్యాయత్నం
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇటీవల కేసు నమోదైంది. దీనిపై జాతీయ పోలీస్ అకాడమీకి చెందిన ప్రివిలేజ్ కమిటీ అంతర్గత విచారణ జరిపింది. సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన కమిటీ.. ప్రాథమికంగా ఆరోపణల్లో నిజం ఉందని నిర్ధారించి ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో ఉన్న బంధువుల ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో (ICU) చికిత్స అందిస్తున్నారు.
సూసైడ్ నోట్‌లో ఏముంది?
ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ ఇప్పుడు కేసును కొత్త మలుపు తిప్పింది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను అందులో ఆయన పూర్తిగా ఖండించారు. తన చావుకు ఆ మహిళా అధికారిణి, ఆమె భర్త, అలాగే ఆమెకు సహకరించిన ఇద్దరు స్నేహితులే కారణమని లేఖలో ఆరోపించారు.
గత ఏడాది జూన్ నుంచి తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఆమెకు వివాహం జరిగిన తర్వాత కూడా అది కొనసాగిందని ఉదయ్ అందులో పేర్కొన్నారు. మహిళా అధికారి ఇష్టపూర్వకంగానే వాట్సప్ (WhatsApp) ద్వారా మెసేజ్‌లు చేసి తన గదికి వచ్చేదని.. జులై 9న కూడా ఆమె తన గదికి వచ్చిందని రాశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సాక్ష్యంగా రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆమె కథ అల్లి తనపై తప్పుడు కేసు పెట్టిందని.. తన ఫోన్‌లో ఈ కేసుకు సంబంధించిన వీడియో, చాట్ ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయని ఆ లేఖలో స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. సోదరుడి ఆవేదన
ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో ఒక స్టోరీ కూడా పోస్ట్ చేశారు. తనపై వచ్చినవి కేవలం నిరాధారమైన ఆరోపణలని, భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అందులో పేర్కొన్నారు. చివరకు సత్యమే గెలుస్తుందని (Satyameva Jayate) ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ.. తన అన్న ఎలాంటి తప్పు చేయలేదని తేల్చి చెప్పారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఐపీఎస్ స్థాయికి ఎదిగాడని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు రావడం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాడమీ ఆయనను సస్పెండ్ చేయలేదని.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్ (EOL) తీసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయితే కానీ అసలు నిజాలు బయటకు రావు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్
- ●Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..
- ●Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి
- ●Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!
- ●Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
- ●Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్

Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..

Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి

Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!





