Trainee IPS Uday Krishna Reddy | లైంగిక ఆరోపణల కేసు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
Trainee IPS Uday Krishna Reddy | తెలుగు రాష్ట్రాల్లో, పోలీసు వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయనకు ఉప్పరపల్లి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Trainee IPS Uday Krishna Reddy | త్రినేత్ర న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో, పోలీసు వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయనకు ఉప్పరపల్లి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 67 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో ఆయన ఊరట లభించినట్లయింది.
ఇదీ కేసు నేపథ్యం..
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29న నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉంటున్నారు. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
- ●Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం
- ●TGHRC | ఎడమ కన్నుకు బదులుగా కుడి కన్నుకు సర్జరీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ
- ●MERITE | తెలంగాణలో 'మెరిట్' స్కీమ్ అమలు
- ●Break Darshan Cancelled | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు
- ●Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్

BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం

TGHRC | ఎడమ కన్నుకు బదులుగా కుడి కన్నుకు సర్జరీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ

MERITE | తెలంగాణలో 'మెరిట్' స్కీమ్ అమలు




