Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. వారం రోజుల్లో ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Traffic Restrictions | ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ కారిడార్ నిర్మాణ పనుల్లో ఇటీవల వేగం పెంచారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ కారిడార్ నిర్మాణ పనుల్లో ఇటీవల వేగం పెంచారు. నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా, వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్పల్ - నారపల్లి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
వారం రోజుల్లోనే ఉప్పల్ - నారపల్లి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు ఉప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అశోక్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఉప్పల్ నుంచి నారపల్లి వైపు వెళ్లే వాహనదారులు, నారపల్లి నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసులతో జీహెచ్ఎంసీ, ఎన్‌హెచ్ఏఐ కలిసి ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో వేగం పెరిగినందున, ట్రాఫిక్ మళ్లించాలని ప్రతిపాదించారు. నిత్యం వేల వాహనాలు ఈ మార్గాల్లో వెళ్తుండడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాహనాలను మళ్లించాలని నిర్ణయించారు. మొత్తానికి వారం రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు మూడేండ్లలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ ఏడాది దసరా నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





