త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | రేపే బ‌క్రీద్.. పాత‌బ‌స్తీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!

Traffic Restrictions | బ‌క్రీద్ ప‌ర్వ‌దినానికి హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బ‌స్తీ ముస్తాబైంది. ప్రార్థ‌న‌ల కోసం ఈద్గాలు సిద్ధ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో గురువారం ఉద‌యం 7 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు.

S

Hyderabad | Published On May 27, 2026, 3.29 pm IST

Traffic Restrictions | రేపే బ‌క్రీద్.. పాత‌బ‌స్తీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : బ‌క్రీద్ ప‌ర్వ‌దినానికి హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బ‌స్తీ ముస్తాబైంది. ప్రార్థ‌న‌ల కోసం ఈద్గాలు సిద్ధ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో గురువారం ఉద‌యం 7 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు. బ‌హ‌దూర్‌పురా, తాడ్‌బ‌న్‌, మ‌దీనా, చార్మినార్, పురానాపూల్, న‌యాపూల్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • పురానాపూల్, కామ‌టిపురా, కిష‌న్ బాగ్ నుంచి ఈద్గా వైపు వెళ్లే వాహ‌నాల‌ను.. బ‌హ‌దూర్‌పుర ఎక్స్ రోడ్డు వ‌ద్ద‌నే నిలిపివేయ‌నున్నారు. ప్రార్థ‌న‌లు ముగిసిన అనంత‌రం వాహ‌నాల‌ను అనుమ‌తించ‌నున్నారు.
  • ఈద్గా, తాడ‌బ్‌ను వైపు వెళ్లే వాహ‌నాల‌ను డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవ‌ర్ మీదుగా జూపార్కు, ఆరాంఘ‌ర్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • శివ‌రాంప‌ల్లి, దాన‌మ్మ హాట్స్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • కాల‌ప‌త్తార్ నుంచి మీరాలం ట్యాంక్ ఈద్గా వైపు వెళ్లే వాహ‌నాల‌ను మోచీ కాల‌నీ, బ‌హ‌దూర్ పురా, షంషీర్‌ఘంజ్, న‌వాబ్ సాహెబ్ కుంట మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • పురానాపూల్ నుంచి బ‌హ‌దూర్‌పురా వైపు వెళ్లే భారీ వాహ‌నాల‌ను జియగూడ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
Advertisement
Advertisement