త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EHCT | ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కొత్త ఊపు.. ఈహెచ్‌సీటీకి పూర్తి అధికారాలు

EHCT | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు అర్హులైన కుటుంబ సభ్యులకు అమలవుతున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం జీవో జారీ చేసింది.

P

Telangana | Published On Jul 16, 2026, 10.12 pm IST

EHCT | ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కొత్త ఊపు.. ఈహెచ్‌సీటీకి పూర్తి అధికారాలు
Advertisement

EHCT | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు అర్హులైన కుటుంబ సభ్యులకు అమలవుతున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం జీవో జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) బోర్డు ఆఫ్ ట్రస్టీలను ఇటీవల పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, నిర్వహణ, పరిపాలన, నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి అధికారాలను బోర్డుకు అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో బోర్డును పునర్నిర్మించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాథమిక వేతనం, ప్రాథమిక పెన్షన్ నుంచి 1.5 శాతం చొప్పున ఈహెచ్‌ఎస్‌కు విరాళం (కాంట్రిబ్యూషన్) వసూలు చేసే విధానాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది.

ఈహెచ్‌ఎస్ నిధులను ట్రస్ట్ డీడ్, నిబంధనలు, అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే వినియోగించాలని బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే నిధులు వినియోగించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధమైన నిబంధనల అమలును కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్‌ఎస్‌ను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఉద్యోగుల ఆరోగ్యం పథకం ప్రారంభిస్తారు. కొత్త ఈహెచ్‌ఎస్‌ పోర్టల్‌, హెల్త్‌కార్డ్‌ల పంపిణీని శ్రీకారం చుట్టనున్నారు.

Advertisement
Advertisement