Traffic Restrictions | హైదరాబాద్‌లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!
Traffic Alert | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ ఆషాఢ బోనాలు (Bonalu) పండుగ వైభవంగా జరుగుతున్నది. ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversion) ఉంటాయిన అధికారులు వెల్లడించారు.
Traffic Alert | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ ఆషాఢ బోనాలు (Bonalu) పండుగ వైభవంగా జరుగుతున్నది. ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversion) ఉంటాయిన అధికారులు వెల్లడించారు. లాల్ దర్వాజా, కార్వాన్, అంబర్‌పేట్, చిలకలగూడ ప్రాంతాల్లో భక్తుల రద్దీ , ఊరేగింపుల దృష్ట్యా ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
పాతబస్తీలో..
పాతబస్తీలో ఆదివారం (ఆగస్టు 9) ఉదయం 6 నుంచి ఊరేంగిపు పూర్తయ్యే వరకు, సోమవారం ఉదయం 9 నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ఈ నేపథ్యంలో మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు (గుల్జార్ హౌస్, చార్మినార్, హిమ్మత్‌పురా, నాగుల్ చింతా, ఆలియాబాద్ మీదుగా) ప్రధాన రహదారి ఊరేగింపు పూర్తయ్యే వరకు అన్ని రకాల వాహనాలకు పూర్తిగా మూసివేయనున్నారు. ఆర్టీసీ బస్సులను చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు అనుమతించరు. దీంతో పాత సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్ షిఫా ఎక్స్ రోడ్లలోనే నిలిపివేస్తారు.
మల్లింపు ఇలా..
ఇంజిన్ బౌలి, ఫలక్‌నుమా మార్గం: ఫలక్‌నుమా వైపు నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను కొత్త షంషేర్‌గంజ్ ‘టీ’ జంక్షన్ వద్ద గోశాల, తాడ్‌బన్ లేదా ఖిల్వత్ వైపు మళ్లిస్తారు.
మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్: ఆలియాబాద్ వెళ్లే వాహనాలు ఇంజిన్ బౌలి వద్ద జహానుమా లేదా తాడ్‌బన్ వైపు వెళ్లాలి.
నాగుల్ చింతా, సుధా టాకీస్: లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్, గౌలీపురా మీదుగా పంపిస్తారు.
గౌలీపురా మార్గం: లాల్ దర్వాజా మోడ్ వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మీర్‌చౌక్ వైపు మళ్లిస్తారు.
చార్మినార్ (పాంచ్ మొహల్లా): నాగుల్ చింతా వైపు వచ్చే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ వైపు మళ్లిస్తారు.
కందికల్ గేట్, ఛత్రినాక: కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనాలను OP ఛత్రినాక పీఎస్ `వై` జంక్షన్ వద్ద గౌలీపురా వైపు, అలాగే ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను వీఎన్ రెడ్డి కమాన్ వైపు మళ్లిస్తారు.
భక్తుల పార్కింగ్ స్థలాలు..
ఆలియాబాద్ వైపు నుంచి వచ్చే వారు: శాలిబండ పోస్టాఫీసు ఎదురుగా రోడ్డుపై సింగిల్ లైన్‌లో లేదా అల్కా థియేటర్ ఖాళీ స్థలంలో.
హరిబౌలి. గౌలీపురా వైపు నుంచి వచ్చే వారు: ఆర్యవైశ్య మందిరం, అల్కా థియేటర్, VDP స్కూల్ మైదానం లేదా మిత్రా స్పోర్ట్స్ క్లబ్.
ఛత్రినాక వైపు నుంచి వచ్చే వారు: లక్ష్మీనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం లేదా ఫూల్‌బాగ్ చమన్ గ్రౌండ్.
మూసాబౌలి, మీర్‌చౌక్ వైపు నుంచి వచ్చే వారు: చార్మినార్ బస్ టెర్మినల్.
కార్వాన్ దర్బార్ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు
కార్వాన్ నల్ల పోచమ్మ ఆలయ పరిసరాల్లో ఏనుగు ఊరేగింపును పురస్కరించుకుని ఆదివారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో..
జియాగూడ, పురానాపూల్ మార్గం: పురానాపూల్ జంక్షన్ నుంచి జియాగూడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు , కార్లను పురానాపూల్ వద్ద మళ్లిస్తారు.
టప్పాచబుత్రా మార్గం: దర్బార్ మైసమ్మ వైపు వెళ్లే సాధారణ వాహనాలను మెస్కో కాలేజ్ వద్ద ‘వీ ది స్కూల్’ మీదుగా మళ్లిస్తారు. టప్పాచబుత్రా నుంచి వచ్చే వాహనాలను జిర్రా రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
యాదవ్ భవన్, మొఘల్ కా నాలా: కార్వాన్ రోడ్డు ద్వారా వచ్చే వాహనాలను ముర్గి చౌక్, తల్లాగడ్డ వద్ద, అలాగే మొఘల్ కా నాలా నుంచి వచ్చే వాహనాలను నెహ్రూ స్కూల్ (2J బస్ స్టాప్) వద్ద మళ్లిస్తారు.
పార్కింగ్ ప్రదేశాలు:
- ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల మైదానం, కార్వాన్.
- తోలి మసీదు (ప్రభుత్వ పాఠశాల ఎదురుగా).
- జగత్ సింగ్ ప్రైవేట్ స్థలం (కేవలం ద్విచక్ర వాహనాల కోసం).
అంబర్‌పేట్ శ్రీ మహంకాళి ఆలయం
అంబర్‌పేట్‌లో బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఫ్లైఓవర్‌ను వినియోగించనున్నారు.
రామంతాపూర్ నుంచి ఆలయానికి వచ్చే భక్తులు: ఫ్లైఓవర్ ఎడమ బైలేన్ గుండా గాంధీ విగ్రహం వద్ద ఎడమ మలుపు తీసుకుని, అంబర్‌పేట్ జీహెచ్ఎసంసీ మైదానంలో వాహనాలను పార్క్ చేయాలి.
తిలక్‌నగర్, ఎన్‌సీసీ మార్గం: రామంతాపూర్, ఉప్పల్ వైపు వెళ్లే బస్సులను రోడ్ నెం. 06 జంక్షన్ వద్ద గోల్నాక వైపు మళ్లించి, గోల్నాక చిల్లా వద్ద యూ-టర్న్ తీసుకుని ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు.
చిలకలగూడలో..
చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ-పోచమ్మ ఆలయంలో బోనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
సీతాఫల్‌మండి జంక్షన్ నుంచి చిలకలగూడ ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలను నామలగుండు, వారసిగూడ ఎక్స్ రోడ్, సీతాఫల్‌మండి టీ జంక్షన్, ఓటీ సిటీ రోడ్ – తార్నాక వైపు మళ్లిస్తారు.
అల్లుగడ్డ బావి, సికింద్రాబాద్ నుంచి చిలకలగూడ మీదుగా సీతాఫల్‌మండి వెళ్లే వాహనాలను పద్మారావు నగర్ టీ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
నగరంలో బోనాల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చని తెలిపారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతా @HYDP (Twitter), Hyderabad Traffic Police (Facebook) అనుసరించాల్సిందిగా కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!
- ●Theyyullathil Sree Kuttichathan Temple | భక్తుల కోరికలు తీర్చే కేరళ 'కుట్టిచాతన్' స్వామి.. ఇక్కడ దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం!
- ●Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?
- ●KTR Warns CM Revanth Reddy | మా ప్రభుత్వం రాగానే ఆ పాలసీని రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన ప్రకటన
- ●Preity Mukhundhan | చీరలో బ్లాస్ట్ జోన్ హీరోయిన్ అందాలు అదుర్స్
- ●Short Film | నో లాంగర్ హ్యూమన్ షార్ట్ ఫిల్మ్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసలు

Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!

Theyyullathil Sree Kuttichathan Temple | భక్తుల కోరికలు తీర్చే కేరళ 'కుట్టిచాతన్' స్వామి.. ఇక్కడ దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం!

Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?

KTR Warns CM Revanth Reddy | మా ప్రభుత్వం రాగానే ఆ పాలసీని రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన ప్రకటన





