Traffic Restrictions | రేపే హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీలోని గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్‌లోని హనుమాన్ ఆయలం వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీలోని గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్‌లోని హనుమాన్ ఆయలం వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్యారడైజ్ జంక్షన్ వరకు, కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి కోఠి వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
కోఠి, అబిడ్స్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్ మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. హనుమాన్ శోభాయాత్రకు అనుగుణంగా వాహనాల మళ్లింపు ఉంటుందన్నారు. కాబట్టి వాహనదారులు, ప్రయాణికులు పోలీసులకు సహకరించాలని కోరారు. తదితర వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించొచ్చు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




