లోడ్ అవుతోంది...


Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో మలక్‌పేట్ అగ్నిమాపక కేంద్రం నుంచి యాదగిరి థియేటర్ వరకు 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 15 నుంచి సుమారు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకొని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఎలివేటెడ్ కారిడార్ సమగ్ర అభివృద్ధి నిర్మాణ పనుల నేపథ్యంలో సైదాబాద్ వై జంక్షన్ నుండి ఐఎస్ సదన్ జంక్షన్ వరకు ఉన్న రహదారి, సైదాబాద్ వై జంక్షన్ నుండి దోభీఘాట్ వరకు ఉన్న రోడ్డులో ఒక వైపు మూసివేయబడుతుంది అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి ఓవైసీ హాస్పిటల్ వైపునకు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్, సరస్వతి నగర్ కమాన్, శంకేశ్వర్ బజార్, ఇండియన్ పెట్రోల్ బంక్, సింగరేణి కాలనీ, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్ లెఫ్ట్ టర్న్, చంపాపేట్ మెయిన్ రోడ్డు, చంపాపేట్ ఎక్స్ రోడ్డు, ఐఎస్ సదన్ మీదుగా వెళ్లాలని సూచించారు.
చంచల్‌గూడ నుంచి సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్లే టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనదారులు సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్, 105 బస్టాప్, రామాలయం కమాన్, లక్ష్మీనగర్, బిస్కట్ ఫ్యాక్టరీ, దోబీఘాట్ జంక్షన్ మీదుగా ఐఎస్ సదన్ మెయిన్ రోడ్డుకు చేరుకోవచ్చు.
చంచల్‌గూడ నుంచి సైదాబాద్ వై జంక్షన్ మీద నుంచి చంపాపేట్ వెళ్లాలనుకునే టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనదారులు సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్, 105 బస్టాప్, రామాలయం కమాన్, లక్ష్మీనగర్, వినయ్ నగర్ లెఫ్ట్ టర్న్, భరత్ గార్డెన్ మీదుగా ఐఎస్ సదన్, చంపాపేట్ మెయిన్‌రోడ్డుకు చేరుకోవచ్చు.
చాదర్‌ఘాట్ నుంచి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను నల్లగొండ ఎక్స్ రోడ్ మీదుగా మలక్‌పేట్ గంజ్, ముసారాంబాగ్ ఎక్స్ రోడ్డు, గడ్డి అన్నారం యూటర్న్, గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్డు, శివగంగా థియేటర్, సరూర్‌నగర్ లేక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, సింగరేణి కాలనీ, ఓనస్ హాస్పిటల్, చంపాపేట్ మెయిన్ రోడ్డుకు చేరుకోవచ్చు.
ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ నుంచి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే అన్ని జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సులను నల్లగొండ ఎక్స్ రోడ్డు మీద నుంచి మలక్‌పేట, ముసారాంబాగ్, దిల్‌షుఖ్‌నగర్, కొత్తపేట్, ఎల్‌బీనగర్ చౌరస్తా మీదుగా మళ్లించనున్నారు.

జనవరి 14, 2026

జనవరి 14, 2026

జనవరి 14, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam