Iran Unrest | తక్షణం దేశం విడిచి వచ్చేయండి..! ఇరాన్ హింస నేపథ్యంలో ప్రభుత్వం అడ్వైజరీ..!
Iran Unrest | రెండువారాలుగా ఇరాన్‌లో హింస కొనసాగుతున్నది. ఇప్పటికే వేలమంది హింసకు బలయ్యారు. ఈ క్రమంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారత పౌరులు వీలైనంత వరకు త్వరగా ఆ దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం సూచించింది.
Iran Unrest | రెండువారాలుగా ఇరాన్‌లో హింస కొనసాగుతున్నది. ఇప్పటికే వేలమంది హింసకు బలయ్యారు. ఈ క్రమంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారత పౌరులు వీలైనంత వరకు త్వరగా ఆ దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం సూచించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ కరెన్సీ రియాల్ రికార్డు స్థాయిలో పడిపోయింది. డిసెంబర్ చివరలో నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒక ప్రావిన్స్‌లో మొదలైన ఉద్యమం.. 31 ప్రావిన్సులకు పాకింది. మొదట్లో ఆర్థిక సమస్యలపై నిరసన ప్రారంభం కాగా.. ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకున్నాయి. అధికార మార్పు కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అడ్వైజరీలో భారత ప్రభుత్వం అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించుకొని సురక్షితంగా ఇరాన్ నుంచి బయటపడాలని విదేశాంగ మంత్రిత్వశాఖ భారత పౌరులకు సూచించింది. ఇరాన్‌లో నివసిస్తున్న భారత జాతీయులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. సున్నిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, ఇరాన్‌లోని భారతీయ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది. ఇరాన్‌లో ఉన్న భారత జాతీయులందరూ తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులను, ఇమ్మిగ్రేషన్ పత్రాలను సురక్షితంగా, ఎప్పుడు తమ వద్దనే ఉంచుకోవాలని సూచించింది. అత్యవసర సమయాలు, ఏదైనా సహాయం కోసం భారత పౌరులు టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. సాధ్యమైనంత మేరకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నెల 5న జారీ చేసిన అడ్వైజరీలో కేంద్రం ఇరాన్‌కు వెళ్లొద్దని సూచించిన విషజ్ఞం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. హింసలో మృతుల సంఖ్య 2,572కి పెరిగింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఈ సంఖ్య దశాబ్దాలుగా ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువ. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలను గుర్తు చేస్తున్నది. మరో వైపు దేశవ్యాప్త ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని విచారణ వేగవంతం చేసి మరణశిక్ష విధించే అవకాశం ఉందని ఇరాన్ ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ మరణాలపై ఇరాన్ ప్రభుత్వాన్ని ట్రంప్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






