Director Teja Son Amitov Teja | సినీ దర్శకుడు తేజ కుమారుడికి దంపతుల టోకరా.. ట్రేడింగ్ పేరిట రూ.72 లక్షలకు కుచ్చు టోపీ..
Director Teja Son Amitov Teja | ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. ట్రేడింగ్ మోసాల బారిన కూడా పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఇలా అనేక మోసాలకు గురయ్యారు. తాజాగా తెలుగు సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ కూడా ఇదే బాధితుల జాబితాలో చేరాడు.
Director Teja Son Amitov Teja | ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. ట్రేడింగ్ మోసాల బారిన కూడా పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఇలా అనేక మోసాలకు గురయ్యారు. తాజాగా తెలుగు సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ కూడా ఇదే బాధితుల జాబితాలో చేరాడు. ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే భారీ ఎత్తున లాభాలు వస్తాయని ఇద్దరు దంపతులు ఆయనను మోసం చేశారు. ఆయనకు కూడా విషయం ఆలస్యంగా అర్థమైంది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులకు నగరంలోనే ఉంటున్న దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు అమితవ్‌కు ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే భారీ ఎత్తున లాభాలు పొందవచ్చని చెప్పారు. తమకు డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఒక వేళ నష్టం వస్తే తమ అపార్ట్‌మెంట్‌ను ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో అది నిజమే అని నమ్మిన అమితవ్ మారు మాట్లాడకుండా విడతల వారిగా రూ.72 లక్షలను వారికి ఇచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వారు చెప్పినట్లు ఎలాంటి లాభాలు రాలేదు. పైగా వారిని సంప్రదిస్తే రేపు మాపు అంటూ కాలయాపన చేశారు. దీంతో అనుమానం వచ్చిన అమితవ్ వారిని నిలదీయగా వారు ముఖం చాటేశారు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈజీ మనీకి ఆశపడొద్దు: పోలీసులు
ట్రేడింగ్ పేరిట ప్రస్తుతం చాలా మంది దుండగులు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కొంత సొమ్మును అందులో పెడితే భారీ ఎత్తున డబ్బు సంపాదించవచ్చనే ఈజీ మనీ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై ప్రజలు ఇలా ట్రేడింగ్ పేరిట డబ్బును పోగొట్టుకుంటున్నారని అన్నారు. కనుక ప్రజలు ఈజీ మనీకి ఆశపడొద్దని, ఎవరూ దేన్నీ సులభంగా ఇవ్వరని, అలా ఇస్తే అందులో కచ్చితంగా మోసం చేసే కుట్ర దాగి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





