#AA23 | అఫీషియల్ అప్‌డేట్..! లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మూవీ..!
#AA23 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషనల్ ఓ మూవీ తెరకెక్కనున్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా మూవీ అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నది.
Entertainment | Published On Jan 14, 2026, 7.00 pm IST
#AA23 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషనల్ ఓ మూవీ తెరకెక్కనున్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా మూవీ అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నది. ఈ మేరకు నిర్మాణ సంస్థ భోగి పండుగ సందర్భంగా బుధవారం అధికారికంగా ప్రకటించారు. #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో వీడియోను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా మూవీని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ జరుగనున్నది. కథ ఇప్పటికే ఖరారైందని, స్క్రిప్ట్ పనులు మొదలైనట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. గతంలో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 మూవీలో నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం మరో తమిళ డైరెక్టర్ అట్లి దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, జాన్వీ కపూర్ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగిశాఖ లోకీ మూవీ షూటింగ్ మొదలుకానున్నది. లోకేశ్ కనగరాజ్ ఇప్పటికే అల్లు అర్జున్‌కు స్టోరీని వినిపించాడు. ఇద్దరి కాంబోలో రానున్న మూవీపై అంచనాలు పెరిగాయి. ఎల్‌సీయూలో ఖైదీ-2ని లోకేశ్ తెరకెక్కించనున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా బన్నీ మూవీనే ట్రాక్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది. చివరగా లోకీ దర్శకత్వంలో కూలీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గత చిత్రాలకు భిన్నంగా లోకీ దర్శకత్వంలో రానున్న మూవీలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని టాక్. ఈ మూవీ 1962లో ప్రచురితమైన డీసీ కామిక్స్ నవెల్ “ది స్టీల్ క్లా” ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



