Software Engineer | భర్త చేసిన అప్పులు తీర్చడానికి.. దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..
ఆమె బీటెక్ చదివింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం (Software Engineer) కూడా చేసింది. అయితే భర్త అప్పుల పాలవడంతో.. ఆయనకు అండగా నిలుద్దామని అనుకుంది. వీలైనంత తొందరగా డబ్బు సంపాదించి తన జీవిత భాగస్వామిని అప్పుల ఊబి నుంచి బయటపడేయడానికి దొంగతనమే (Thief) మార్గమని భావించింది.
త్రినేత్ర.న్యూస్: ఆమె బీటెక్ చదివింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం (Software Engineer) కూడా చేసింది. అయితే భర్త అప్పుల పాలవడంతో.. ఆయనకు అండగా నిలుద్దామని అనుకుంది. వీలైనంత తొందరగా డబ్బు సంపాదించి తన జీవిత భాగస్వామిని అప్పుల ఊబి నుంచి బయటపడేయడానికి దొంగతనమే (Thief) మార్గమని భావించింది.. ఇకేముంది రంగంలోకి దిగింది.. ఈ ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడింది.
వరంగల్‌కు చెందిన అనితారెడ్డి బీటెక్ వరకు చదివింది. అనంతరం చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా చేసింది. రెండేండ్ల క్రితం మేడ్చల్‌కు చెందిన రాజేశ్‌ను ప్రేమ పెండ్లి చేసుకుంది. కూతురు పుట్టడంతో ఉద్యోగం మానేసింది. తొలుత ఓ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేసిన రాజేశ్.. ఆ తర్వాత పని మానేశాడు. ఈ క్రమంలో రూ.నాలుగైదు లక్షలు అప్పు చేశాడు. దీంతో అతడు అప్పులపాలయ్యామంటూ తరచూ బాధపడుతూ ఉండేవాడు. భార్త బాధను చూడలేకపోయిన అనిత.. అతనికి అండగా నిలబడాలని అనుకుంది. ఏదైనా చేయాలనుకుని దొంగతనం చేస్తే.. తొందరగా అప్పుల నుంచి బయటపడొచ్చని భావించింది.
దీనికి ఓ పథకం వేసింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన నల్ల కమల్ అనే వృద్ధురాలు అవంతినగర్ తోట కాలనీలోని తన ఇంటికి వచ్చి పైఅంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. అప్పటికే అక్కడ కాపుకాస్తున్న అనిత.. లిఫ్ట్ తలుపులు మూసుకోక ముందే లోపలికి చెయ్యిపెట్టి ఆ వృద్ధురాలి మెడలో ఉన్న మంగళసూత్రం, నల్లపూసల గొలుసు తెంపేందుకు ప్రయత్నించింది. అయితే బాధితురాలు గట్టిగా అరవడంతో చేతికందిన అర తులం నల్లపూసల గొలుసు తెంచుకుని పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా అనితారెడ్డిని పట్టుకున్నారు. ఇంకేముంది.. భర్తను అప్పుల భారం నుంచి బయటపడేయాలనుకుని.. తాను జైలుపాలైంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





