Bengal ED Raids Row | కోల్‌కతా హైకోర్టులో టీఎంసీకి షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం
Bengal ED Raids Row | పశ్చిమ బెంగాల్ ఈడీ దాడులపై నమోదైన కేసులను కలకత్తా హైకోర్టు బుధవారం విచారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి.
Bengal ED Raids Row | పశ్చిమ బెంగాల్ ఈడీ దాడులపై నమోదైన కేసులను కలకత్తా హైకోర్టు బుధవారం విచారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ సందర్భంగా టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. గత వారం (జనవరి 8) దాడుల సమయంలో ఐ ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయం, ఇంటి నుంచి తాము ఏమీ స్వాధీనం చేసుకోలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపినట్లుగా కోర్టు పేర్కొంది. రెండుచోట్ల ఈడీ దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న వ్యక్తిగత, రాజకీయపరమైన డేటాను భద్రపరచాలని కోరుతూ టీఎంసీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు హాజరై.. తాము ఎక్కడా ఎలాంటి డేటాను స్వాధీనం చేసుకోలేదని కోర్టుకు వెల్లడించారు. జస్టిస్ సువ్రా ఘోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇంకా పరిగణలోకి తీసుకునేందుకు ఏమీ లేదని వ్యాఖ్యానించారు. జనవరి 8న సోదాల సమయంలో సాల్ట్ లేక్‌లోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కార్యాలయాన్ని, దక్షిణ కోల్‌కతాలోని లౌడాన్ స్ట్రీట్‌లోని సంస్థ డైరెక్టర్ నివాసాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. మమతా బెనర్జీ దర్యాప్తును అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఘోష్ వాయిదా వేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






