త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka | మ‌ళ్లీ నాయ‌క‌త్వ మార్పు వార్త‌లు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివ‌కుమార్‌

Karnataka | క‌ర్నాట‌క‌లో గ‌త కొంత‌కాలంగా ముఖ్య‌మంత్రి మార్పు ఊహాగానాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీతో డిప్యూటీ సీఎం శివ‌కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. దాంతో మ‌రోసారి అధికార మార్పు త‌థ్య‌మ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో డీకే శివ‌కుమార్ బుధ‌వారం స్పందించారు.

P

Telangana | Published On Jan 14, 2026, 6.12 pm IST

Karnataka | మ‌ళ్లీ నాయ‌క‌త్వ మార్పు వార్త‌లు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివ‌కుమార్‌
Advertisement

Karnataka | క‌ర్నాట‌క‌లో గ‌త కొంత‌కాలంగా ముఖ్య‌మంత్రి మార్పు ఊహాగానాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీతో డిప్యూటీ సీఎం శివ‌కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. దాంతో మ‌రోసారి అధికార మార్పు త‌థ్య‌మ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో డీకే శివ‌కుమార్ బుధ‌వారం స్పందించారు. రాహుల్ గాంధీతో జ‌రిగిన స‌మావేశంలో నాయ‌క‌త్వ మార్పుపై ఎలాంటి చ‌ర్చ జ‌రుగ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్నాట‌క పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీతో శివ‌కుమార్ ఏకాంతంగా మాట్లాడటం క‌నిపించింది.

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై మ‌ళ్లీ వార్త‌లు జోరందుకున్నాయి. డీకే బుధ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. తాను క‌ర్నాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడిన‌ని, రాహుల్ గాంధీతో లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత అని.. ప్రోటోకాల్ ప్ర‌కార‌మే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, ఇత‌ర విష‌యాల గురించి మాట్లాడ‌లేద‌న్నారు. తన పార్టీ నాయకులతో జరిపిన సంభాషణలను బహిరంగంగా చర్చించబోనన్నారు. నాయ‌క‌త్వ మార్పుపై సైతం చ‌ర్చ జ‌రుగ‌లేద‌న్న ఆయ‌న‌.. కేవ‌లం మంచి ప‌నులు చేయాల‌ని మాత్ర‌మే రాహుల్ త‌మ‌కు చెప్పార‌ని, ఆయ‌న ఆదేశాల‌ను పాటిస్తామ‌న్నారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై డీకే శివ‌కుమార్‌ను ప్ర‌శ్నించ‌గా జ‌న‌వ‌రి 16న వెళ్తాన్నారు. త‌న‌తో పాటు సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను రాహుల్ ఢిల్లీకి ఆహ్వానించార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ ప‌టాన్ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఇంకా ఖ‌రార‌వ‌లేద‌ని, సంక్రాంతి త‌ర్వాత రాహుల్‌ను క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గాల‌ని తామంతా కోరుకుంటున్నామ‌ని, తాను మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని అశోక్ వ్యాఖ్యానించారు. అయితే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టిప‌డేశారు. అవి కేవలం మీడియా సృష్టేనని, నాయకత్వ మార్పు విషయంలో తనకు, డీకే శివకుమార్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయ‌న స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement