Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Traffic Restrictions | హైదరాబాద్ నగర వాసులకు, ప్రయాణికులకు, వాహనదారులకు ముఖ్య గమనిక. ఈ నెల 21వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర వాసులకు, ప్రయాణికులకు, వాహనదారులకు ముఖ్య గమనిక. ఈ నెల 21వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంతో పాటు సమీప ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్, నల్లగొండ జిల్లాల వైపు నుంచి వచ్చే ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్, నల్లగొండ జిల్లాలకు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 వరకు నాగోల్ - హబ్సిగూడ, బోడుప్పల్ - అంబర్‌పేట మార్గాల్లోకి వాహనాల అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మార్గాల్లో ఐపీఎల్ అభిమానుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మార్గాల్లో లారీలు, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ప్రయివేటు బస్సులు, జేసీబీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ భారీ వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- ఈ నెల 21 న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్, ఎల్‌బీ నగర్ వైపు మళ్లించనున్నారు.
- ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను నాగోల్ నుంచి ఉప్పల్ భయగాత్ మీదుగా టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచర్ల, ఐవోసీఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు మళ్లించనున్నారు.
- తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు నుంచి నాచారం, ఎన్ఎఫ్‌సీ రోటరీ, ఐవోసీఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు మళ్లించనున్నారు.
- రామంతాపూర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను స్ట్రీట్ నంబర్ 8 మీదుగా హబ్సిగూడ ఎక్స్ రోడ్స్, నాచారం, ఎన్ఎఫ్‌సీ రోటరీ, ఐవోసీఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ మీదుగా మళ్లించనున్నారు.
- వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను ఘట్‌కేసర్ వద్దనే మళ్లించి ఓఆర్ఆర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా ఎంజీబీఎస్ చేరుకోవచ్చు.
- హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి వరంగల్ వైపు వెళ్లే బస్సులు, ఇతర వాహనదారులు.. ఎల్‌బీనగర్, హయత్ నగర్, ఓఆర్ఆర్ మీదుగా వరంగల్ వైపుకు మళ్లిస్తారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





