త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | నేడు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

Traffic Restrictions | ఉప్ప‌ల్ స్టేడియంలో సాయంత్రం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌స్‌ బెంగ‌ళూరు టీమ్‌లు పోటీ ప‌డ‌నున్నాయి. ఇక ఉప్ప‌ల్ స్టేడియంలో ఇదే చివ‌రి మ్యాచ్ కావ‌డంతో క్రికెట్ అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ పోలీసులు అల‌ర్ట్ అయ్యారు.

S

Hyderabad | Published On May 22, 2026, 7.04 am IST

Traffic Restrictions | నేడు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని ఉప్ప‌ల్ స్టేడియంలో శుక్ర‌వారం ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే 6 మ్యాచ్‌లు ఉప్ప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించ‌గా, ఇవాళ నిర్వ‌హించేది చివ‌రిది. ఉప్ప‌ల్ స్టేడియంలో సాయంత్రం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌స్‌ బెంగ‌ళూరు టీమ్‌లు పోటీ ప‌డ‌నున్నాయి. ఇక ఉప్ప‌ల్ స్టేడియంలో ఇదే చివ‌రి మ్యాచ్ కావ‌డంతో క్రికెట్ అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. ఉప్ప‌ల్ స్టేడియంతో పాటు ప‌రిస‌ర‌, స‌మీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. అవ‌స‌ర‌మైన చోట ట్రాఫిక్ మ‌ళ్లింపులు చేప‌ట్టారు.

మ‌. 12 నుంచి రాత్రి 12 వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. నాగోల్ నుండి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ మార్గం), బోడుప్పల్ నుండి అంబర్‌పేట్ (ఉప్పల్ జంక్షన్, రామంతాపూర్ మార్గం) వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీలైనంతవరకు ఈ మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • ఘ‌ట్‌కేస‌ర్ నుంచి ఉప్ప‌ల్ వైపు వ‌చ్చే హెవీ వాహనాలను మెహఫిల్ హోటల్ వద్ద HMDA ఉప్పల్ భగాయ‌త్ ప్రవేశద్వారం వద్ద నాగోల్ – ఎల్‌బీన‌గ‌ర్ వైపు మ‌ళ్లిస్తారు.
  • ఎల్‌బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని నాగోల్ యూటర్న్ – HMDA భగాయ‌త్ – టయోటా యూటర్న్ – బోడుప్పల్ – చెంగిచెర్ల – IOCL చెర్లపల్లి / ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
  • తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను హబ్సిగూడ X రోడ్ వద్ద నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
  • రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను స్ట్రీట్ నం. 8 వద్ద హబ్సిగూడ X రోడ్ – నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
  • ఉప్పల్ జంక్షన్‌లోని ఎలివేటెడ్ కారిడార్ వర్క్ పనులు జరుగుతున్నందున వరంగల్ రహదారి మూసివేశారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులను సర్వే ఆఫ్ ఇండియా వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డమీదుగా వరంగల్ రహదారి మీదుగా బోడుప్పల్, ఘట్‌కేసర్, వరంగల్ వైపు మ‌ళ్లిస్తున్నారు.
  • అలాగే వరంగల్ నుండి హైదరాబాద్‌, సికింద్రాబాద్ వచ్చే వాహనదారులను మెహ‌ఫిల్ హోటల్ వద్ద ఉప్పల్ భ‌గాయ‌త్‌ మీదుగా నాగోల్ నుండి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు మ‌ళ్లిస్తున్నారు.
  • వరంగల్ నుండి హైదరాబాద్‌కు ఉప్పల్ మార్గం ద్వారా వచ్చే హెవీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ORR ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ – ఎల్.బి.నగర్ – దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ప్రయాణించాలి.
  • హైదరాబాద్ నుండి వరంగల్ వైపు ఉప్పల్ మార్గం ద్వారా వెళ్లే వాహనాలు ఎల్.బి.నగర్ – హయత్‌నగర్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR ఎక్కి వరంగల్ చేరుకోవాలి.
Advertisement
Advertisement