త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. మే 22 వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో మ‌ల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఏప్రిల్ 13, 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్ప‌ల్ స్డేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు.

S

Hyderabad | Published On Apr 12, 2026, 5.30 pm IST

Traffic Restrictions | ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. మే 22 వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో మ‌ల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఏప్రిల్ 13, 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్ప‌ల్ స్డేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • ఈ నెల 13న ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ - రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో ఘ‌ట్‌కేస‌ర్ నుంచి ఉప్ప‌ల్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను హెచ్ఎండీఏ ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ మీదుగా నాగోల్, ఎల్‌బీ న‌గ‌ర్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • ఎల్‌బీన‌గ‌ర్ నుంచి ఉప్ప‌ల్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను నాగోల్ నుంచి ఉప్ప‌ల్ భ‌య‌గాత్ మీదుగా ట‌యోటా యూట‌ర్న్, బోడుప్ప‌ల్, చెంగిచ‌ర్ల‌, ఐవోసీఎల్ చ‌ర్ల‌ప‌ల్లి, ఘ‌ట్‌కేస‌ర్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • తార్నాక నుంచి ఉప్ప‌ల్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను హ‌బ్సిగూడ ఎక్స్ రోడ్డు నుంచి నాచారం, ఎన్ఎఫ్‌సీ రోట‌రీ, ఐవోసీఎల్ చ‌ర్ల‌ప‌ల్లి, ఘ‌ట్‌కేస‌ర్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • రామంతాపూర్ నుంచి ఉప్ప‌ల్ వ‌చ్చే వాహ‌నాల‌ను స్ట్రీట్ నంబ‌ర్ 8 మీదుగా హ‌బ్సిగూడ ఎక్స్ రోడ్స్, నాచారం, ఎన్ఎఫ్‌సీ రోట‌రీ, ఐవోసీఎల్ చ‌ర్ల‌ప‌ల్లి, ఘ‌ట్‌కేస‌ర్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే వాహ‌నాల‌ను ఘ‌ట్‌కేస‌ర్ వ‌ద్ద‌నే మ‌ళ్లించి ఓఆర్ఆర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎల్‌బీ న‌గ‌ర్, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ మీదుగా ఎంజీబీఎస్ చేరుకోవ‌చ్చు.
  • హైద‌రాబాద్ ఎంజీబీఎస్ నుంచి వ‌రంగ‌ల్ వైపు వెళ్లే బ‌స్సులు, ఇత‌ర వాహ‌న‌దారులు.. ఎల్‌బీన‌గ‌ర్, హ‌య‌త్ న‌గ‌ర్, ఓఆర్ఆర్ మీదుగా వ‌రంగ‌ల్ వైపుకు మ‌ళ్లిస్తారు.
Advertisement
Advertisement