త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganesh Immersion | ఎల్లుండి ట్యాంక్‌బండ్‌, నెక్లెస్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. 10 వేల కెమెరాల‌తో నిఘా

Ganesh Immersion | ఈ నెల 25న గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 వేల సీసీటీవీ కెమెరాల‌తో నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Sep 23, 2026, 5.48 pm IST

Ganesh Immersion | ఎల్లుండి ట్యాంక్‌బండ్‌, నెక్లెస్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. 10 వేల కెమెరాల‌తో నిఘా
Advertisement

Ganesh Immersion | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 25న గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 వేల సీసీటీవీ కెమెరాల‌తో నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. నిమ‌జ్జ‌న వేడుక‌ల‌పై సీపీ స‌జ్జ‌నార్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

గణేశ్‌ వేడుకలకు సంబంధించి కొన్ని ఫేక్‌ వీడియోలు వైరల్‌ చేశారని, పాత, ఫేక్‌ వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. గణేశ్‌ మండపాల వద్ద అస‌భ్య‌క‌ర‌మైన‌ పాటలు, డ్యాన్స్‌లపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌కు 20వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌న్నారు. జిల్లాల నుంచి 8,400 మంది పోలీసులు బందోబ‌స్తులో ఉంటార‌ని తెలిపారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్రకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

ఈ నెల 25న హైద‌రాబాద్ న‌గ‌రంలోకి ప్ర‌యివేటు బ‌స్సుల‌ను, భారీ వాహ‌నాల‌ను అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. హుస్సేన్ సాగ‌ర్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. 25 క్రైమ్ విభాగాల బృందాలు నిమ‌జ్జ‌నం వేడుక‌ల్లో పాల్గొంటాయ‌న్నారు. చైన్ స్నాచింగ్, ఇత‌ర చోరీలు జ‌ర‌గ‌కుండా క్రైమ్ విభాగాల నిఘా ఉంటుంద‌న్నారు.

Advertisement
Advertisement