త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | సెప్టెంబ‌ర్ 7 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

Telangana Assembly | సెప్టెంబ‌ర్ 7 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ఉంటాయ‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Aug 24, 2026, 8.23 pm IST

Telangana Assembly | సెప్టెంబ‌ర్ 7 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : సెప్టెంబ‌ర్ 7 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ఉంటాయ‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స‌చివాల‌యంలో అందుబాటులో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో సీఎం రేవంత్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి అని సీఎం ఆదేశించారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావు అని ఆయ‌న అన్నారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, ఫారెస్టు క్లియరెన్సులకి సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతీ ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి అని సీఎం సూచించారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్‌లు ఆది శ్రీనివాస్,రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమాయి, మందుల సామేల్, వేడ్మా బొజ్జు, కోరం కనకయ్య, లక్ష్మి కాంతరావు, రామ్ దాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళి నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘు వీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉన్నారు.

Advertisement
Advertisement