త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Dharmapuri Aravind | ఈడ ఉన్న‌యే బంద‌యెట‌ట్టున్న‌యంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్‌స్టిట్యూష‌న్లు తెస్త‌డ‌ట‌

MP Dharmapuri Aravind | ఫీజు బ‌కాయిలు చెల్లించ‌క రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థ‌లే బంద‌యేట‌ట్లు ఉన్నాయ‌ని.. రేవంతేమో ఆక్స్‌ఫ‌ర్డ్ నుంచి ఇంకేవో ఇన్‌స్టిట్యూష‌న్లు తీసుకొస్తామ‌ని చెప్తున్నాడ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఎద్దేవా చేశారు. కొండా సురేఖ‌ను తిట్టుమ‌ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల‌కు చెప్పి ప్రెస్‌మీట్లు పెట్టించాడ‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Aug 24, 2026, 6.35 pm IST

MP Dharmapuri Aravind | ఈడ ఉన్న‌యే బంద‌యెట‌ట్టున్న‌యంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్‌స్టిట్యూష‌న్లు తెస్త‌డ‌ట‌
Advertisement
  • మండ‌లానికో ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల‌ట‌
  • చంద్ర మండ‌లంల గూడ పెడ్త‌రు.. అది గూడా ఒక మండ‌ల‌మే గ‌దా!
  • రేవంత్ ఎన్కున్న పిల్ల‌లంద‌ర్ని మోసం చేస్తుండు
  • ఫీజు బ‌కాయి-బీజేపీ ల‌డాయి దీక్ష‌లో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ సెటైర్లు

MP Dharmapuri Aravind | త్రినేత్ర‌.న్యూస్: ఫీజు బ‌కాయిలు చెల్లించ‌క రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థ‌లే బంద‌యేట‌ట్లు ఉన్నాయ‌ని.. రేవంతేమో ఆక్స్‌ఫ‌ర్డ్ నుంచి ఇంకేవో ఇన్‌స్టిట్యూష‌న్లు తీసుకొస్తామ‌ని చెప్తున్నాడ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఎద్దేవా చేశారు. 20 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు బకాయిలు ఇయ్య‌క కాల‌క్షేపం చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ఇక్క‌డ ట్యూష‌న్ ఫీజు ఇచ్చే దిక్కు కూడా లేద‌న్నారు. కొండా సురేఖ‌ను తిట్టుమ‌ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల‌కు చెప్పి ప్రెస్‌మీట్లు పెట్టించాడ‌ని ఆరోపించారు. ‘ఫీజు బ‌కాయి-బీజేపీ ల‌డాయి’ దీక్ష‌లో సోమ‌వారం సీఎం రేవంత్‌పై త‌న‌దైన స్ట‌యిల్‌లో సెటైర్ల వ‌ర్షం కురిపించారు.

మ‌న ప్రియ‌త‌మ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గారు ముఖ్య‌మంత్రి అయి దాదాపు మూడేండ్లు ద‌గ్గెర‌వ‌డుతుంది. ఇక్క‌డున్న విద్యార్థుల‌కు ట్యూష‌న్ ఫీజు ఇచ్చే దిక్కు లేదు గ‌ని ఈన‌న‌ట ఆక్స్‌ఫ‌ర్డ్‌కు వోయి బోస్ట‌న్‌కు వోయి హార్వ‌ర్డ్‌కు వోయి ఆన్నుంచట ఇన్‌స్టిట్యూష‌న్ల‌ను తీసుకొనొస్త‌డ‌ట‌. ఉన్న ఇన్‌స్టిట్యూష‌న్లే బంద‌యెట‌ట్టున్న‌య్ ఈడ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఈయ‌క‌. ఇవాళ ప్ర‌తి సంవ‌త్స‌రం దాదాపు 20 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు బకాయిలు ఇయ్య‌క కాల‌క్షేపం చేస్తున్న‌డు ముఖ్య‌మంత్రి.

ఏదో ఉద్ద‌రిస్త నేను అనుకుంటుండు. ఈన విద్యాశాఖ మంత్రి గూడా మ‌న క‌ర్మగాలి. దేశ వ్య‌తిరేక శ‌క్తుల‌తోని చేయి క‌ల్ప‌డానికి పిల్ల‌ల విద్య పేరు మీద ఈన తిరుగుతా ఉన్న‌డు ప్ర‌పంచం. ఈన ఫీ రీయింబ‌ర్స్‌మెంటే కాక ఆళ్ల మ్యానిఫెస్టోల ఏమేం హామీలు ఉన్న‌యో అవ‌న్నింటిని నిల‌బెట్టుకోలే. విద్యార్థుల కోసం చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఇదొక ఘ‌ట్టం.

ఇది చాలా పెద్ద ఎత్తున పోత‌ది. ఫీజు బ‌కాయిలు ఒక్క‌టే గాదు.. రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌డానికి కూడా. ఈన ప్ర‌త్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెన‌క‌బ‌డిన అగ్ర‌వ‌ర్ణాలు, ఈళ్ల‌కు వెన్నెముక‌గా నిలుస్తున్న మైనారిటీ వర్గాల పిల్ల‌ల్ని మోసం చేస్తున్న‌డు ఈన‌.

జాబ్ క్యాలెండ‌ర్‌నేమో మ‌ర్సిపోయిర్రు. గ‌త 12 ఏండ్ల నుంచి జాబ్ క్యాలెండ‌ర్‌లేదిడ‌. ఇవిటికి జ‌వాబు చెప్పండ్రా అంటే.. ఆ పోయినోడేమో అంత‌కుముందున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌కాయిలు వెట్టిపోయింది మేమేంజేయాలే అంట‌డు. మ‌రి మ్యానిఫెస్టోల‌ల్ల పీక‌నీకి రాస్తున్న‌రా? కాంగ్రెసోళ్ల‌ను అడిగితెనేమో ఆ కేసీఆర్‌ బ‌కాయిలు పెట్టిపోయిండంట‌రు. ప్ర‌తి మండ‌లంల ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ వెడ్త‌ర‌ట‌.. రేవంత్‌రెడ్డికి చ‌దువు రాద‌ని తెల్సిపోతుంది గీన్నే. ఇగ నెక్ట్స్ టైం చంద్ర‌మండ‌లంల కూడా వెడ్త‌రు ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌. అది గూడ మండ‌ల‌మే గ‌దా!

సురేఖ‌ను తిడితే మాకెమ‌న్నా ఆఫ‌ర్ ఉందా మ‌రి!

కొండా సురేఖ గారి ఎపిసోడ్‌ల ఆమెను తిడితే మీ పెండింగ్ బిల్లుల‌న్నీ క్లియ‌ర్ చేస్త‌మ‌ని రేవంత్ చెప్పుకుండ‌ట‌. 16 మంది మీటింగ్ పెట్టి మాట్లాడిండ్రు. ఫైళ్లు అన్ని క్లియ‌ర్ చేస్త‌డ‌ట‌. ఆ ఆఫ‌ర్ బీజేపీ ఎమ్మెల్యేల‌కు కూడా ఉందో లేదో మ‌రి. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉండదా వేం నరేందర్ రెడ్డి?

ఈనికొక తొండ‌.. ఈని నెత్తిల ఉంది పెండ‌..

ఈన పొంక‌నాలు గొట్టేటోడు ఏమ‌న్న‌డండీ.. అప్ప‌ట్ల న‌న్ను గుండు అని మాట్లాడిండు.. ఈనికొక తొండ‌.. ఈని నెత్తిల ఉంది పెండ‌. దేశంలో మ‌త క‌ల్లోలాలు సృష్టించ‌డం కోసం, యాంటీ నేష‌న‌ల్ వ్య‌క్తుల‌ను క‌ల‌వ‌నీకి పోయిండు. వీళ్లంద‌రిని ఎందుకు క‌ల‌వ‌నీకి పోయిండో కాంగ్రెస్ పార్టీ చెప్పాలే.

రియ‌ల్ ఎస్టేట్‌ల ఎక్స్‌టార్ష‌న్ రేవంత్ కంటే ఎక్కువ ఎవడు చేయ‌లే. ముఖ్య‌మంత్రి కాకముందు ప‌త్తాలాట. ఇది ఈన బ్యాగ్రౌండు. ఇట్లాంటోడు ఎంత దూర‌మైనా పోత‌డు. అక్క‌డున్న‌ది మోదీ గ‌వ‌ర్న‌మెంటు. ఏసి నూకిండ్ర‌నుకో బెయిల్ గూడా రాదు. భూమికి నాలుగు అడుగులు లేడు.. ఎంపీల‌ను బెదిరిస్తాడ్‌.

ఈడికెళ్లి జూమ్ కాల్ వెట్టుకుంటే అయిపాయే..

డ‌బ్బు కోసం ఎంత దూర‌మైనా పోత‌డు. ఇయ్యాళ్ల ఒక ట్వీట్ వెట్టిండు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీల చ‌ర్చించుడు వెట్టిండ‌ట‌.. ఈడికెళ్లి జూమ్ కాల్ వెట్టుకుంటే అయిపాయే. మూడు సంవ‌త్స‌రాల‌ల్ల ఎన్నిసార్లు చర్చించిన‌వ్‌?
టైంపాస్‌కు వొయ్యి.. ఎంఐఎం వోని పెండ్లికి అటెండ్ కానీకి వోయి మంది సొమ్ముతోటి అబ‌ద్దాలు చెప్తావ్‌.

మీ ఎమ్మెల్యేలు నీ కుర్చి గుంజెట‌ట్టే ఉన్న‌రు..

ఇంజినీరింగ్ వేస్ట్ అని కొత్త‌గ క‌నుగొన్నందుకు ఈన‌కు ఇయ్యాలి డిగ్రీ. మొత్తం తెలంగాణ రాష్ట్రంల వాన‌లు రాక‌.. క‌రెంటు స‌క్క‌గ లేక.. నువ్ చేసిన వాగ్దానాలు స‌రిగా లేక‌.. రాజ‌కీయం సక్క‌గ లేక ఏంటికిరాబై కోట్ల రూపాలు దండ‌గ జేసి బ‌య‌ట తిరుగుడు. మీ ఎమ్మెల్యేలు నీ కుర్చి గుంజెట‌ట్టే ఉన్న‌రు. ఇంకా తెల్వ‌నియి ఇంకెన్ని ఉన్న‌యో. దిస్ ఇజ్ న్యూ ఇండియా.. దిస్ ఇస్ మోదీజీస్ ఇండియా.. ఏం ఎక్కువ చేసినా లోప‌లుంట‌వ్.. బీ కేర్‌ఫుల్ అంటూ రేవంత్‌కు త‌న‌దైన స్ట‌యిల్‌లో వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Advertisement