Traffic Restrictions | మెహిదీపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..
Traffic Restrictions | మెహిదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనులు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : మెహిదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనులు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మే 24, 25 తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో వాహనాల మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- మాసబ్‌ట్యాంక్ నుంచి రేతిబౌలి వైపు వెళ్లే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 2, 3 వద్ద మెరాజ్ కేఫ్ మీదుగా కుడి వైపునకు మళ్లించి మెహిదీపట్నం పిల్లర్ నంబర్ 15 వద్ద సాధారణ మార్గంలోకి అనుమతిస్తారు.
- టోలిచౌకి, లంగర్‌హౌస్ నుంచి మాసబ్‌ట్యాంక్ వైపు వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 23 వద్ద యూటర్న్ తీసుకుని.. వ్యతిరేక దిశలో పంపి.. అనంతరం పిల్లర్ నంబర్ 4, 5 వద్ద మళ్లీ సాధారణ మార్గంలోకి అనుమతిస్తారు.
- మాసబ్‌ట్యాంక్ నుంచి ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే వాహనదారులు సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి వద్ద లక్ష్మీనగర్ ర్యాంప్(పిల్లర్ నంబర్ 77) వద్ద మళ్లిస్తారు.
- శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వచ్చే వాహనదారులు.. లక్ష్మీనగర్ ర్యాంప్(పిల్లర్ నంబర్ 88) వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై పనుల పురోగతిని బట్టి వాహనాలను ఆయా డౌన్ రాంపుల ద్వారా కిందకు అనుమతిస్తారు.
వాహనదారులకు విజ్ఞప్తి:
వాహనదారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్‌డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ (facebook.com/HYDTP), ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ (@HYDTP) లను పరిశీలించాల్సిందిగా పోలీసులు సూచించారు. ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా, సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు




