త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో ఏడు రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఆ రూట్ల‌లో అస్స‌లు వెళ్ల‌కండి..!

Traffic Restrictions | హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏడు రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. కైథ‌లాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఐడీఎల్ రోడ్ చివ‌ర‌న డ్రైనేజీ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డంతో.. మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు.

S

Hyderabad | Published On Jan 31, 2026, 7.20 pm IST

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో ఏడు రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఆ రూట్ల‌లో అస్స‌లు వెళ్ల‌కండి..!
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏడు రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. కైథ‌లాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఐడీఎల్ రోడ్ చివ‌ర‌న డ్రైనేజీ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డంతో.. మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 31 నుంచి ఏడు రోజుల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.

ఈ రూట్ మూసివేత‌

మాదాపూర్, కైథ‌లాపూర్ నుంచి ఐడీఎల్ లేక్ రోడ్డు మీదుగా కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ వైపు వెళ్లే మార్గాన్ని వారం రోజుల పాటు మూసివేయ‌నున్నారు. శ‌నివారం నుంచి ఏడు రోజుల పాటు ఈ మార్గంలో వాహ‌నాల రాక‌పోక‌లు నిలిపివేయ‌నున్నారు.

మ‌ళ్లింపు మార్గాలివే..

  • మాదాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ వైపు వెళ్లే వాహ‌న‌దారులు.. య‌శోద హాస్పిట‌ల్, ఆర్వోబీ, జేఎన్టీయూ, లెఫ్ట్ ట‌ర్న్, యూ ట‌ర్న్ మీదుగా కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ చేరుకోవాలి.
  • య‌శోద హాస్పిట‌ల్, కైథ‌లాపూర్, రెయిన్‌బో విస్తా, మూసాపేట్, లెఫ్ట్ యూట‌ర్న్ మీదుగా వై జంక్ష‌న్ చేరుకోవాలి.
Advertisement

తాజావార్తలు

Advertisement