త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్.. నేటి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వ‌ద్ద స్టీల్ బ్రిడ్జితో పాటు అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు.

S

Hyderabad | Published On Feb 27, 2026, 6.04 am IST

Traffic Restrictions | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్.. నేటి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వ‌ద్ద స్టీల్ బ్రిడ్జితో పాటు అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, ముగ్ధ జంక్ష‌న్ వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

  • ఎన్ఎఫ్‌సీఎల్ నుంచి శ్రీన‌గ‌ర్ కాల‌నీ టీ జంక్ష‌న్, సాగ‌ర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, దుర్గం చెరువు వైపున‌కు వెళ్లే వాహ‌నాల‌ను శ్రీన‌గ‌ర్ కాల‌నీ, ఇందిరా న‌గ‌ర్ లేబ‌ర్ అడ్డా, వెంక‌ట‌గిరి ఎక్స్ రోడ్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.
  • జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌ర్ 36, 45 నుంచి ఎన్ఎఫ్‌సీఎల్ వైపున‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను ఇందిరా న‌గ‌ర్ లేబ‌ర్ అడ్డా, శ్రీన‌గ‌ర్ కాల‌నీ, వాల్యూ జోన్, పంజాగుట్ట మెయిన్ రోడ్డు వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.
  • రోడ్ నంబ‌ర్ 1, బంజారాహిల్స్, కేసీపీ నుంచి కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నంబ‌ర్ 36 వైపు నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ మీదుగా అగ్ర‌సేన్ ఐల్యాండ్, భార‌తీయ విద్యా భ‌వ‌న్, రోడ్డు నంబ‌ర్ 45, జూబ్లీహిల్స్ వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.
  • మాస‌బ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపున‌కు వెళ్లే వాహ‌నాల‌ను విరించి హాస్పిట‌ల్ నుంచి అగ్ర‌సేన్ ఐలాండ్, భార‌తీయ విద్యా భ‌వ‌న్, రోడ్డు నంబ‌ర్ 45, జూబ్లీహిల్స్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • అత్య‌వ‌స‌ర‌, ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసుల స‌హాయం కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్ 9010203626 కు కాల్ చేయొచ్చు.
Advertisement
Advertisement