త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | ఇవాళ రాత్రికి హైద‌రాబాద్‌లో అన్ని ఫ్లై ఓవ‌ర్లు మూసివేత‌..!

Traffic Restrictions | జ‌న‌వ‌రి 16వ తేదీ రాత్రి హైద‌రాబాద్ న‌గ‌రంలోని అన్ని ఫ్లై ఓవ‌ర్ల‌ను మూసివేయ‌నున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు.

S

Hyderabad | Published On Jan 16, 2026, 3.35 pm IST

Traffic Restrictions | ఇవాళ రాత్రికి హైద‌రాబాద్‌లో అన్ని ఫ్లై ఓవ‌ర్లు మూసివేత‌..!
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : జ‌న‌వ‌రి 16వ తేదీ రాత్రి హైద‌రాబాద్ న‌గ‌రంలోని అన్ని ఫ్లై ఓవ‌ర్ల‌ను మూసివేయ‌నున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు. షాబ్ ఈ మేరాజ్‌(జ‌గ్నే కీ రాత్) వేడుక‌ల సంద‌ర్భంగా న‌గ‌రంలోని ఫ్లై ఓవ‌ర్ల‌ను మూసివేస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు రాత్రి 10 గంట‌ల నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. తెలంగాణ త‌ల్లి, షేక్‌పేట్‌, మ‌న్మోహ‌న్ సింగ్‌, బ‌హ‌దూర్‌పురా ఫ్లై ఓవ‌ర్లను మూసివేయ‌నున్నారు. ఈ మార్గాల్లో వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవ‌ర్, పీవీ న‌ర‌సింహా రావు ఎక్స్‌ప్రెస్‌వే, లంగ‌ర్‌హౌజ్ ఫ్లై ఓవ‌ర్లు మూసి ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 9010203626 నంబ‌ర్‌కు కాల్ చేయాల‌ని పోలీసులు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement