త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Alert | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత ఆ రూట్‌లో వెళ్లారో ట్రాఫిక్‌లో చిక్కుకున్న‌ట్లే!

Traffic Alert | సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ అధికార‌ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి `చ‌లో భ‌వ‌న్‌` (Chalo Lok Bhavan) కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్ర‌హం నుంచి లోక్‌భ‌వ‌న్‌కు నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు.

G

Hyderabad | Published On Oct 8, 2026, 9.10 am IST

Traffic Alert | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత ఆ రూట్‌లో వెళ్లారో ట్రాఫిక్‌లో చిక్కుకున్న‌ట్లే!
Advertisement

Traffic Alert | త్రినేత్ర న్యూస్‌: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ అధికార‌ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి `చ‌లో భ‌వ‌న్‌` (Chalo Lok Bhavan) కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్ర‌హం నుంచి లోక్‌భ‌వ‌న్‌కు నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. దీంతో లోక్‌భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Alert) విధించారు. సెక్రటేరియట్‌ జంక్షన్‌, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు (Traffic Restrictions) అమ‌ల్లో ఉంటాయ‌ని చెప్పారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఆయా మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో స‌చివాలయం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల‌ని కోరారు.

ఇక మింట్‌ కాంపౌండ్‌ లేన్‌, ఖైరతాబాద్‌ (Khairatabad) మార్గాల్లో కూడా వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. ఇందిరా రోటరీ, ఇక్బాల్‌ మినార్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు వాహనాలను దారి మళ్లించేలా ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసులు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చ‌లో లోక్‌భ‌వ‌న్‌ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌, మంత్రులు, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌండ్ త‌దిత‌ర నేత‌లు పాల్గొంటారు. దీంతో ఆయా మార్గాల్లో పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

Advertisement
Advertisement