Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ మార్గంలో వన్‌వే ట్రయల్ రన్.. ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Alert | హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లోని కేబీఆర్ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా వన్ వే (One-way) విధానాన్ని అమలు చేస్తున్నారు.
Traffic Alert | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లోని కేబీఆర్ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా వన్ వే (One-way) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాహనాలను వన్ వేలోనే అనుమతించనున్నారు. ఈ 2 గంటల ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో శాశ్వత మళ్లింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు. దీనికి అనుగుణంగా వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి వెళ్లేవారు..
పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ లేదా కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవనం వద్ద ఎడమవైపునకు తిరగాలి. అక్కడ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఓమేగా ఆసుపత్రి మీదుగా రోడ్ నెం.45 లేదా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి..
మాదాపూర్ లేదా జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 వైపు వెళ్లే వారు ఇందిరానగర్ గడ్డ రోడ్డు (రోడ్ నెం.5) ద్వారా వెంకటగిరి జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి డైమండ్ హౌస్, రోడ్ నెం.10 మీదుగా అల్-కజార్ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
రోడ్ నంబర్ 45 నుంచి..
ఈ మార్గంలో వచ్చే వాహనాలను చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ మీదుగా డైవర్ట్ చేయనున్నారు.
మరిన్ని సూచనలు..
- ప్రయాణికులు ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య పేర్కొన్న ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలి.
- పేర్కొన్న నిర్ణీత మార్గాల్లో ఎటువంటి ‘U’ టర్న్‌లు ఉండవు. ఎగ్జిట్స్ కోసం రోడ్డుకు ఎడమ (LEFT) వైపున ప్రయాణించాలి.
- సాఫీగా ట్రాఫిక్ కదలిక కోసం మార్గంలో ఏర్పాటు చేసిన నిర్ణీత ఎగ్జిట్ (EXIT) పాయింట్లను గమనించాలి.
- క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసుల సూచనలను, సైనేజ్ (సంకేత బోర్డులు) పాటించాలి.
- రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను ఉపయోగించాలి.
- రద్దీని తగ్గించడానికి ప్రజా రవాణా, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




