Monda Market | మోండా మార్కెట్‌లో చోరీ… రూ.25 లక్షల విలువైన ఆభరణాలు లూటీ
Monda Market | సికింద్రాబాద్ మోండా మార్కెట్ (Monda Market)లో దొంగలు బంగారు షాపు తాళాలు పగలగొట్టి ఆభరణాలు చోరీ చేశారు. షాపులోని 16 తులాల బంగారు ఆభరణాలు లూటీ చేశారు. వాటి విలువ దాదాపు రూ. 25 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Monda Market | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ (Monda Market)లో దొంగలు బంగారు షాపు తాళాలు పగలగొట్టి ఆభరణాలు చోరీ చేశారు. షాపులోని 16 తులాల బంగారు ఆభరణాలు లూటీ చేశారు. వాటి విలువ దాదాపు రూ. 25 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా బంగారు, వెండి ఆభరణాల దుకాణాలు ఉండడంతో దుకాణాదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జర్గీష్ జువెలరీ షాప్‌లో వివిధ ఆభరణాలు తయారుచేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి దుకాణం యజమాని తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి షటర్ తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చేసే సరికి సిద్ధం చేసిన 16 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా ఓ యువకుడు బ్యాగుతో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆ ప్రాంతంలో బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులు ఎక్కువ. చోరీకు గురైన షాపులో సైతం బెంగాల్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని దుకాణ యజమాని తెలిపారు. దీంతో తెలిసిన వారి పనే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






