త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Sridhar Babu | “బేకర్ హ్యూస్”ను ప్రారంభించిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు

Minister Sridhar Babu | "ది ఎక్స్ క్లూజివ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్"ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) గురువారం ప్రారంభించారు.

D

Hyderabad | Published On Apr 23, 2026, 2.49 pm IST

Minister Sridhar Babu | “బేకర్ హ్యూస్”ను ప్రారంభించిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు
Advertisement

Minister Sridhar Babu | సిద్దిపేట (Siddipet) జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం (Tuniki Bollaram) టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులోని "ఆజాద్ - సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ & ఇన్నోవేషన్ సెంటర్"లో 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన "ది ఎక్స్ క్లూజివ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్"ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) గురువారం ప్రారంభించారు.

అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ "బేకర్ హ్యూస్"...ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్& ఎక్విప్ మెంట్ (వోఎఫ్ సీఈ), ఇండస్ట్రియల్ & ఎనర్జీ టెక్నాలజీ (ఐఈటీ), టెక్నాలజీ & డిజిటల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ యూనిట్‌లో బేకర్ హ్యూస్.. ఇండస్ట్రియల్ & ఎనర్జీ టెక్నాలజీ (IET) విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్ (High-Precision) ఉత్పత్తులు తయారవుతాయి. కొత్తగా 230 హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌కి ఉపాధి లభిస్తుంది. తయారీ రంగంలో "మేడ్ ఇన్ తెలంగాణ" మరింత విశ్వవ్యాప్తం అవుతుంది.

Also Read..

మేడిగ‌డ్డ‌లో కుంగింది రెండు పిల్ల‌ర్లే.. SLBC కుంగి 8 మంది చనిపోయారు.. దీనిపై ఎందుకు విచారణ చెయ్యలేదు : త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

టార్గెట్లు కాదు.. కస్టమర్ల భద్రతే ముఖ్యం!!

ఎల్లుండి క‌విత కొత్త పార్టీ.. తెలంగాణ ప్రజా జాగృతి కోసం ద‌ర‌ఖాస్తు

Advertisement
Advertisement