త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Haldi Vagu | పెండ్లికి వెళ్లివ‌స్తూ.. హల్దీ వాగులో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి..

Haldi Vagu | సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో (Nacharam) విషాదం చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లి వ‌స్తూ హల్దీ వాగులో (Haldi Vagu) ఈతకు దిగిన ముగ్గురు వ్యక్తులు నీటమునిగి మృతిచెందారు.

G

Telangana | Published On May 7, 2026, 8.53 am IST

Haldi Vagu | పెండ్లికి వెళ్లివ‌స్తూ.. హల్దీ వాగులో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి..
Advertisement

Haldi Vagu | త్రినేత్ర‌.న్యూస్‌: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో (Nacharam) విషాదం చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లి వ‌స్తూ హల్దీ వాగులో (Haldi Vagu) ఈతకు దిగిన ముగ్గురు వ్యక్తులు నీటమునిగి మృతిచెందారు.

మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్‌కు (Narsapur) చెందిన ఎర్ర‌గుళ్ల ప్ర‌శాంత్ (27), వికాస్ (27), కొంత‌మి ఆనంద్ రెడ్డి (27) బుధవారం తూప్రాన్‌లో జ‌రిగిన‌ ఓ వివాహ వేడుకకు హాజ‌ర‌య్యారు. అనంతరం నాచారం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప‌క్క‌నే ఉన్న‌ హ‌ల్దీ వాగును చూసి స‌ర‌దాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగారు.

అయితే వాగు లోతును సరిగా అంచనా వేయక‌పోవ‌డంతో ముగ్గురు అందులో గల్లంతయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయితే గురువారం ఉద‌యం ముగ్గురి మృతదేహాలను గుర్తించి వాగు నుంచి బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన వారు మృతి చెంద‌డంతో న‌ర్సాపూర్‌లో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

Advertisement
Advertisement