Drunk and Drive | తాగి నడిపి యాక్సిడెంట్ చేస్తే.. ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలుసా?
Drunk and Drive | మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝులిపించారు. వారంతంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు నిర్వహించారు.
Drunk and Drive | త్రినేత్ర.న్యూస్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝులిపించారు. వారంతంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 283 మందిని అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ ట్రాఫిక్ ఎస్ఐ జీ. హన్మంతరావు చెప్పారు. వారిలో 227 మంది ద్విచక్ర వాహనదారులు, 9 మంది త్రిచక్ర వాహనదారులు, 39 మంది కార్లు, మరో 8 మంది హెవీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదుచేశామన్నారు.

పట్టుబడినవారిలో 28 మందికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) అధికంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. వీరందరినీ చట్టపరంగా కోర్టు ముందు హాజరుపర్చనున్నామని వెల్లడించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామన్నారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంని చెప్పారు.
కాగా, గత వారం (ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు) మొత్తం 160 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయని తెలిపారు. వీరిలో 12 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 148 మందికి జరిమానా విధించబడినట్లు చెప్పారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






