Hyderabad Traffic Police | ఫుల్లుగా తాగారు.. 445 మంది చిక్కారు..
Hyderabad Traffic Police | త్రినేత్ర.న్యూస్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం కోసం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మొత్తం 445 మంది వాహనదారులు పట్టుబడ్డారు.
Hyderabad Traffic Police | త్రినేత్ర.న్యూస్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం కోసం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మొత్తం 445 మంది వాహనదారులు పట్టుబడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం పట్టుబడిన వాహనదారుల్లో 371 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 26 మంది త్రిచక్ర వాహనదారులు ఉన్నారని, 48 మంది ఫోర్ వీలర్, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నట్లు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిలో మద్యం స్థాయిలు (BAC Levels) 99 మందిలో 30 నుంచి 50 శాతం వరకు ఉన్నాయని తెలిపారు. 173 మందికి బీఏసీ స్థాయిలు 51 నుంచి 100 మధ్య వచ్చాయని, 100 మందికి 101 నుంచి 150 స్థాయిలు వచ్చాయని తెలిపారు. అలాగే మరో 42 మందికి బీఏసీ స్థాయిలు 151 నుంచి 200 మధ్య ఉన్నాయని, 11 మందికి 201 నుంచి 250 మధ్య ఉన్నాయని అన్నారు. 12 మందికి బీఏసీ స్థాయిలు 251 నుంచి 300 వరకు వచ్చాయని, 8 మందికి మాత్రం 300కు పైగా నమోదయ్యాయని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంత మాత్రం సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాహనదారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vinodkumar | సీఈసీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి
- ●TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్
- ●ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
- ●CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
- ●N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

Vinodkumar | సీఈసీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి

TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్

ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ






