TGS RTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సిటీ మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో తగ్గిన చార్జీలు
TGS RTC | ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో (TGS RTC) మహిళలకు ఉచిత ప్రయాణం (Free Bus for Women) కల్పించింది. దీంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఒక్కసారిగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్‌లో తిరిగే సిటీ బస్సులు కూడా మహిళలతో కిక్కిరిసి పోతున్నాయి.
TGS RTC | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో (TGS RTC) మహిళలకు ఉచిత ప్రయాణం (Free Bus for Women) కల్పించింది. దీంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఒక్కసారిగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్‌లో తిరిగే సిటీ బస్సులు కూడా మహిళలతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో పురుష ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే గగణమై పోతున్నది. అలా ఎక్కిన వారికీ సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. టికెట్ కొనుక్కుని ప్రయాణించే తమకు సీట్లు లేకుంటే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదికాస్తా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణమంటేనే పురుషులు జడుసుకునేలా మారిపోయింది. దీంతో ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు సంస్థ మెట్రో డీలక్స్ సర్వీసులను (City Metro Deluxe) ప్రారంభించింది. వీటిలో ఆధార్ చెల్లుబాటు కాదని ప్రకటించింది.
దీంతో ఈ బస్సుల్లోనైనా ప్రశాంతంగా వెళ్దామంటే.. టికెట్ రేటు భారీగా (Bus Ticket Prices) ఉండటంతో ఆదరణ అంతంతమాత్రంగానే ఉంటున్నది. ఈ నేపథ్యంలో మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు (AC Bus) చార్జీలను తగ్గించింది. టికెట్ ధరలను సవరించనప్పటికీ, డిస్కౌంట్ పేరుతో ప్రస్తుతానికి తగ్గించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉండే చార్జీలతో సమం చేసింది. మూడు నెలల పాటు దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది.
డీలక్స్ సర్వీసులపై అధికారులు ఇటీవల సర్వే చేశారు. ఈ సందర్భంగా టికెట్ ధర ఎక్కువగా ఉందన్న మాట చాలా మంది నుంచి వినిపించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తమకు సీట్లు దొరకటం లేదని, వాటిని వదిలి ఎక్కువ టికెట్ ఖర్చుతో డీలక్స్ బస్సులో వెళ్లటం ఏం న్యాయమని కొందరు ప్రశ్నించారు. దీంతో డీలక్స్ బస్సుల టికెట్ ధరను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీనిని మార్చి నుంచి మే వరకు అమలు చేయనుంది. ప్రస్తుతం సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉన్న టికెట్ చార్జీలనే వీటిల్లో అమలు చేస్తున్నారు. ఈ మూడు నెలల పాటు పరిశీలించి, ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే కొంతకాలం పాటు అవే చార్జీలను కొనసాగించనున్నారు. దీంతోపాటు ఆ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచాలని చేయాలని నిర్ణయించారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | ఏ ఒక్కరినీ ఉద్యోగం నుంచి తొలగించేది లేదు.. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ భరోసా
మే 2, 2026

Shankar Goud | ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు
ఏప్రిల్ 24, 2026

Ponnam Prabhakar | రాజకీయ పార్టీలు రెచ్చగొట్టడం వల్లే ఇలాంటి ఘటనలు.. శంకర్ గౌడ్ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



