త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. రేపు ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థుల‌చే ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

S

Hyderabad | Published On Jun 18, 2026, 7.23 pm IST

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. రేపు ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థుల‌చే ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఈ క్ర‌మంలో వాహ‌నదారులు, ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌త్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు

  • ర‌వీంద్ర భార‌తి నుంచి నాంప‌ల్లి రోడ్డు వ‌ర‌కు
  • లిబ‌ర్టీ నుంచి అబిడ్స్ రోడ్డు వ‌ర‌కు
  • బ‌షీర్‌బాగ్ జంక్ష‌న్‌తో పాటు ఆ ప‌రిస‌ర ప్రాంతాలు
  • ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంప‌ల్లి వ‌ర‌కు
  • బీజేఆర్ విగ్ర‌హం నుంచి అబిడ్స్ వ‌ర‌కు
Advertisement
Advertisement