Telangana Bonalu 2026 | బోనమెత్తనున్న భాగ్యనగరం: రూ.20 కోట్లతో ఘనంగా ఏర్పాట్లు.. జూలై 16 నుంచి షురూ!
తెలంగాణ ఆత్మకు ప్రతీకైన బోనాల పండుగను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ఉత్సవాల పూర్తి షెడ్యూల్, తదితర వివరాలు ఇవే.
- బోనాల ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు
- జూలై 16న గోల్కొండ బోనాలతో ప్రారంభమై, ఆగస్టు 13 వరకు కొనసాగనున్న ఉత్సవాలు
- ఆగస్టు 2న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆగస్టు 10న పాతబస్తీ బోనాలు
- మహిళలకు ఫ్రీ బస్సు ఉన్నందున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, భారీ ఏర్పాట్లు
Telangana Bonalu 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే 'బోనాల ఉత్సవాలకు' (Bonalu Festival) భాగ్యనగరం ముస్తాబవుతోంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నెల రోజుల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. బుధవారం హైదరాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో (Review Meeting) పండుగ ఏర్పాట్లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రికార్డు స్థాయిలో ఆలయాలకు ఫండ్స్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ఈసారి బోనాలను మరింత ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ వస్తోంది. 2025లో రికార్డు స్థాయిలో 3,026 ఆలయాలకు రూ.5.80 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఈ ఏడాది కూడా అర్హత ఉన్న ఆలయాలను పారదర్శకంగా గుర్తించి ఫండ్స్ ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

స్పెషల్ బస్సులు.. భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Bus Scheme) అమలులో ఉండటంతో ఈసారి ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో TGSRTC ఆధ్వర్యంలో స్పెషల్ బస్సులు నడపనున్నారు. ప్రధాన ఆలయాల వద్ద క్యూ లైన్లు, సీసీ కెమెరాలు (CCTV monitoring), మెడికల్ క్యాంపులు, నిరంతర విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళా భక్తుల భద్రతకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని పోలీసులను అలర్ట్ చేశారు.
బోనాల షెడ్యూల్ (Bonalu 2026 Schedule)
జులై 16: గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవస్థానంలో బోనాలు ప్రారంభం (ప్రభుత్వం తరపున తొలి పట్టు వస్త్రాల సమర్పణ). ఆషాఢ మాసంలోని ఐదు గురువారాలు, నాలుగు ఆదివారాల్లో ఇక్కడ జాతర కొనసాగుతుంది.
జులై 21, 22: బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాల సమర్పణ, రథోత్సవం.

ఆగస్టు 2, 3: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన బోనాలు. మరుసటి రోజు (ఆగస్టు 3న) రంగం కార్యక్రమం, అంబారీ ఊరేగింపు.
ఆగస్టు 9, 10: సబ్జీ మండి, కార్వాన్ ప్రాంతాలతో పాటు పాతబస్తీలోని (హరిబౌలి) శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు.
పురావస్తు శాఖ ఉచిత ప్రవేశం
చారిత్రక ప్రాధాన్యం ఉన్న గోల్కొండ కోటను సందర్శించే భక్తుల కోసం, బోనాల సమయంలో పురావస్తు శాఖ ఉచిత ఎంట్రీని కల్పించనుంది. ఈ ఆషాఢ మాసంలో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఘటోత్సవాలు, తొట్టెల ఊరేగింపులతో హైదరాబాద్ నగరమంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందనుంది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ (Traffic Plan) ను అమలు చేయనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు
- ●TGSRTC Commercial Shops For Rent | వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ఈ 'గోల్డెన్ చాన్స్' మీకోసమే!
- ●Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు
- ●PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి
- ●Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్..!
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?

Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు

TGSRTC Commercial Shops For Rent | వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ఈ 'గోల్డెన్ చాన్స్' మీకోసమే!

Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి






