త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TDR Rules | టీడీఆర్ 2012కి కీల‌క స‌వ‌ర‌ణ‌.. 21 మీట‌ర్ల ఎత్తులో నిర్మించేవ‌న్నీ హైరైజ్ భ‌వ‌నాలే..!

TDR Rules | తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కి సంబంధించి కీలక స‌వ‌ర‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు సంబంధిత శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Hyderabad | Published On Mar 22, 2026, 3.02 pm IST

TDR Rules | టీడీఆర్ 2012కి కీల‌క స‌వ‌ర‌ణ‌.. 21 మీట‌ర్ల ఎత్తులో నిర్మించేవ‌న్నీ హైరైజ్ భ‌వ‌నాలే..!
Advertisement

TDR Rules | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కి సంబంధించి కీలక స‌వ‌ర‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు సంబంధిత శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ స‌వ‌ర‌ణ ప్ర‌కారం.. 21 మీట‌ర్లు లేదా అంత‌కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భ‌వ‌నాల‌న్నింటినీ ఇక నుంచి హైరైజ్ భ‌వ‌నాలుగా గుర్తించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 750 చ‌ద‌ర‌పు మీట‌ర్ల నుంచి 2000 చ‌.మీ. ఉన్న స్థ‌లంలో 18-21 మీట‌ర్ల భ‌వ‌నాలు నిర్మించాలంటే టీడీఆర్ వినియోగం త‌ప్ప‌నిస‌రి చేసింది. నాన్ హైరైజ్ భ‌వ‌నాల‌కు టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్ స‌డ‌లింపు ఇచ్చారు.

ఇప్పటి వరకు 2012లో జారీ చేసిన ఉత్తర్వులోని నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటికి కాలానుగుణంగా ప్రభుత్వాలు సవరణలు చేశాయి. వీటివల్ల లాభంతో పాటు సమస్యలూ వస్తున్నాయని ప్రణాళిక విభాగం భావించింది. అదే సమయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2016లో నిర్మాణ అనుమతులకు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది.

వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం టీడీఆర్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, భవన నిర్మాణ నిబంధనలలో వెసులుబాటును పెంపొందించడానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement