త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taxi Driver | అడ్డంగా నిల‌బ‌డ్డాడ‌ని కారుతో ఢీకొట్టి.. బానెట్‌పై 2 కి.మీ. ఈడ్చుకెళ్లిన ట్యాక్సీ డ్రైవ‌ర్‌

Taxi Driver | హైద‌రాబాద్‌లో (Hyderabad) దారుణం చోట‌చేసుకుంది. ఓ ట్యాక్సీ డ్రైవర్ (Taxi Driver) త‌న‌ కారుతో బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, ప్రశ్నించిన బాధితుడిని 2 కిలోమీటర్ల మేర కారు బోనెట్‌పై ఈడ్చుకెళ్లారు.

G

Hyderabad | Published On May 3, 2026, 10.34 am IST

Taxi Driver | అడ్డంగా నిల‌బ‌డ్డాడ‌ని కారుతో ఢీకొట్టి.. బానెట్‌పై 2 కి.మీ. ఈడ్చుకెళ్లిన ట్యాక్సీ డ్రైవ‌ర్‌
Advertisement

Taxi Driver | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) దారుణం చోట‌చేసుకుంది. ఓ ట్యాక్సీ డ్రైవర్ (Taxi Driver) త‌న‌ కారుతో బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, ప్రశ్నించిన బాధితుడిని 2 కిలోమీటర్ల మేర కారు బోనెట్‌పై (Car Bonnet) ఈడ్చుకెళ్లారు. శ‌నివారం రాత్రి మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జ‌రిగింది. న‌గ‌రానికి చెందిన ఎస్‌కే జిలానీ (SK Jilani) అనే వ్య‌క్తి త‌న కుమారుడు ఫైసల్ కలిసి బైక్‌పై గాయత్రి నగర్ నుంచి ఎల్‌బీ నగర్ వైపు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకులు కిందపడిపోయారు. అయితే జిలానీ కారు డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా పెద్దదిగా కావ‌డంతో కారులో ఉన్న వ్యక్తి అత‌నిపై దాడి చేశారు.

అడ్డంగా నిల‌బ‌డ్డాడ‌ని..

డ్రైవ‌ర్ కారు తీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా, జిలానీ దానికి అడ్డంగా నిలబడ్డారు. దీంతో కారును అలాగే ముందుకు తీసుకెళ్ల‌డంతో జిలానీ కారు బోనెట్‌ను గట్టిగా పట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆగ‌కుండా దాదాపు 2 కిలోమీట‌ర్ల దూరం ఈడ్చుకెళ్లారు. బాలాపూర్ (Balapur) క్రాస్‌రోడ్స్ వరకు వెళ్లిన‌ మళ్లీ వెనక్కి తిరిగింది. గ‌మ‌నించిన వాహ‌న‌దారులు కారును వెంబడించి మంద మల్లమ్మ జంక్షన్ సమీపంలో అడ్డుకుని, డ్రైవ‌ర్‌ను ప‌ట్టుకున్నారు.

ఈ ఘటనలో జిలానీ తీవ్రంగా గాయపడగా.. అతడి కుమారుడు ఫైసల్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇరువురు ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న‌మోదుచేసిన మీర్‌పేట‌ పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Advertisement
Advertisement