త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayalalithaa | రూ. 83 ల‌క్ష‌ల ఇంటి ప‌న్ను బ‌కాయి.. జ‌య‌ల‌లిత ఇల్లును సీజ్ చేసిన రేవంత్ స‌ర్కార్

Jayalalithaa | త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇల్లుకు ఉంది. అయితే శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఉన్న జ‌య‌ల‌లిత ఇంటిని సోమ‌వారం అధికారులు సీజ్ చేశారు.

S

Hyderabad | Published On Mar 31, 2026, 7.25 am IST

Jayalalithaa | రూ. 83 ల‌క్ష‌ల ఇంటి ప‌న్ను బ‌కాయి.. జ‌య‌ల‌లిత ఇల్లును సీజ్ చేసిన రేవంత్ స‌ర్కార్
Advertisement

Jayalalithaa | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇల్లుకు ఉంది. అయితే శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఉన్న జ‌య‌ల‌లిత ఇంటిని సోమ‌వారం అధికారులు సీజ్ చేశారు. రూ. 83 ల‌క్ష‌ల ఇంటి ప‌న్ను పెండింగ్‌లో ఉండ‌డంతోనే ఆమె ఇంటిని సీజ్ చేసిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో జీ+4 భవనాన్ని సీజ్‌ చేశారు. ఇంటికి సంబంధించి సుమారు రూ.83 లక్షల ఆస్తి పన్ను పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు.

శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఉన్న జ‌య‌ల‌లిత నివాసం విస్తీర్ణం 14 వేల చదరపు అడుగులు. దాన్ని రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1967లో మారేడుపల్లిలో రాధికా కాలనీలోనూ జ‌య‌ల‌లిత మ‌రో ఇల్లు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆమెకు రెండు వ్య‌వ‌సాయ క్షేత్రాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement