Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదు
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్ మారేడ్ పల్లి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.
- అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర
- అరెస్టులు, నిర్బంధాలతో అడ్డుకునే ప్రయత్నం
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్ మారేడ్ పల్లి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 220 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. శనివారం నాటి శాంతి ర్యాలీ కోసం ఈ నెల 5న దరఖాస్తు చేస్తే పోలీసు అధికారులు ఉద్దేశ పూర్వకంగా ర్యాలీకి కొద్ది గంటల ముందు అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని వాట్సాప్‌లో సమాచారం పంపడం అన్యాయమన్నారు. ర్యాలీ జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేసి.. భయానక వాతావరణం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే రెట్టింపు ఉత్సాహంతో ఫిబ్రవరిలో..
అయినప్పటికీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో హాజరయ్యారని, వారందరికీ అభినందనలు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు తరలించి.. విడుదల సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరి మొదటివారంలో రెట్టింపు ఉత్సాహంతో భారీ ర్యాలీ నిర్వహించుకుందామని, న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే సికింద్రాబాద్ బంద్‌కు కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వం కాపాడుకునేందుకు చేసే పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఎంతో ప్రశాంతంగా ఉండే నార్త్ జోన్ లో వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలకు చెందిన ప్రజలు కలసి మెలసి ఉంటారని, వీరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు.
అవి కూడా జీహెచ్ఎంసీలోనే ఉన్నయ్..
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందని చెప్పే ముఖ్యమంత్రి నార్త్ జోన్ లోని పోలీస్ సర్కిల్స్, జీహెచ్ఎంసీ సర్కిల్స్, డివిజన్లను మల్కాజిగిరి జోన్‌లో ఎలా కలిపారని ప్రశ్నించారు. అనంతరం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు టీ మహేశ్వరి, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు నాగులు, శ్రీహరి, కిశోర్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, మహేశ్ యాదవ్, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, టీఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






