త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు.. భ‌క్తులకు ఇబ్బంది లేకుండా చూడాల‌న్న మాజీ మంత్రి త‌ల‌సాని

Talasani Srinivas Yadav | హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ ఆల‌యం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) అధికారుల‌కు సూచించారు. అమ్మ‌వారి క‌ల్యాణానికి హైద‌రాబాద్ న‌లుమూల నుంచే కాకుండా, చుట్టుప‌క్క‌ల జిల్లాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు వ‌స్తార‌ని చెప్పారు.

G

Hyderabad | Published On Jul 18, 2026, 12.33 pm IST

Talasani Srinivas Yadav | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు.. భ‌క్తులకు ఇబ్బంది లేకుండా చూడాల‌న్న మాజీ మంత్రి త‌ల‌సాని
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ ఆల‌యం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ (Balkampet Yellamma) క‌ల్యాణానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) అధికారుల‌కు సూచించారు. అమ్మ‌వారి క‌ల్యాణానికి (Yellamma Kalyanam) హైద‌రాబాద్ న‌లుమూల నుంచే కాకుండా, చుట్టుప‌క్క‌ల జిల్లాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు వ‌స్తార‌ని చెప్పారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరానున్నార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స్థానికులు సహ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ నెల 21న బ‌ల్కంపేట అమ్మ‌వారి క‌ల్యాణం, 22న ర‌థోత్స‌వం జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వివిధ శాఖ‌ల అధికారులతో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అమ్మ‌వారి క‌ల్యాణం జ‌రిగేలా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని, ఆల‌య ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండాలా అద‌న‌పు సిబ్బందిని నియ‌మించాల‌ని అధికారుల‌కు సూచించారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తులు తోపులాట‌కు గురికాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు.

ఆల‌యాన్ని ఎంతో అభివృద్ధి చేశాం..

2014లో తెంగాణ ఏర్పాడిన త‌ర్వాత అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) ఆధ్వారంలో ఆల‌యాన్ని ఎంతో అభివృద్ధి చేశామ‌ని తెలిపారు. నాడు అమ్మ‌వారి క‌ల్యాణానికి 20 వేల మంది వ‌స్తే, ప్ర‌స్తుతం 7 నుంచి 8 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు వ‌స్తున్నార‌ని చెప్పారు. ఆల‌యానికి భ‌క్తుల రాక‌తోపాటు ఆదాయం కూడా పెరిగింద‌ని వెల్ల‌డించారు. అమ్మ‌వారి క‌ల్యాణానికి, ర‌థోత్స‌వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

స్థానికుల‌కు ప్రాధాన్యం..

ప్ర‌ధానంగా వాట‌ర్ వ‌ర్క్స్‌, ఎల‌క్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి కేంద్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌ధాన ర‌హదారితోపాటు ఆల‌యం చుట్టుప‌క్క‌ల గ‌ల్లీల్లో పాట్‌హోల్స్ లేకుండా, రోడ్లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్రంగా ఉండేలా చూడాల‌ని సూచించారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి అంతా క‌లిసి ప‌నిచేద్దామ‌న్నారు. పాసులు, టికెట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాల‌ని ఆల‌య ఈవోకి సూచించారు. స్థానికుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క‌ల్యాణం నుంచి ర‌థోత్సవం (Rathotsavam) వ‌ర‌కు అధికారుల‌కు స‌హ‌రించాల‌ని స్థానికులను కోరారు.

Advertisement
Advertisement