Talasani Sai Kiran | ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని సాయి కిరణ్..!
Talasani Sai Kiran | ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం.
Talasani Sai Kiran | త్రినేత్ర న్యూస్ : ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరి అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ ఖరారు చేసే అవకాశం ఉంది.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడంతో.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో ఆరు నెలల్లో ఈ నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమికంగా తమ అభ్యర్థిని ఖరారు చేయడంతో.. మిగిలిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రావాల్సి ఉంది.
ఖైరతాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని నిన్న దానం నాగేందర్ బహిరంగంగా ప్రకటించారు. మళ్లీ దానం పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక బీజేపీ నుంచి గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతల రామచంద్రారెడ్డి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి






