త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suspicious Death | ఓయో హోట‌ల్‌కి వెళ్లిన జంట‌.. అర్ధ‌రాత్రి యువ‌తి మృతి.. ప్రియుడు ప‌రార్‌

Suspicious Death | హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓయో హోట‌ల్‌లో (OYO Hotel) యువ‌తి అనుమానాస్ప‌ద స్థితిలో (Suspicious Death) మృతి చెందింది. ప్రియుడే (Boyfriend) ఆమెను హ‌త్య‌చేసి ప‌రారైన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

G

Hyderabad | Published On Sep 22, 2026, 12.44 pm IST

Suspicious Death | ఓయో హోట‌ల్‌కి వెళ్లిన జంట‌.. అర్ధ‌రాత్రి యువ‌తి మృతి.. ప్రియుడు ప‌రార్‌
Advertisement

Suspicious Death | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓయో హోట‌ల్‌లో (OYO Hotel) యువ‌తి అనుమానాస్ప‌ద స్థితిలో (Suspicious Death) మృతి చెందింది. ప్రియుడే (Boyfriend) ఆమెను హ‌త్య‌చేసి ప‌రారైన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖప‌ట్నానికి (Visakhapatnam) చెందిన షార‌న్ నిఖిత టోప్నో (23) త‌న ప్రియుడు శ్రీనివాస రవితేజతో క‌లిసి న‌గ‌రానికి వ‌చ్చారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో మాదాపూర్ (Madhapur) సిద్ధిక్ నగర్‌లోని ఓ ఓయో హోటల్ గ‌దికి వెళ్లారు. అయితే, మంగ‌ళ‌వారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంటకు కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌ నుంచి యువ‌తి మృతిపై మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. యువ‌తిని ఆమె ప్రియుడు ర‌వితేజ‌, హోట‌ల్ సిబ్బంది క‌లిసి అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు.

దీంతో హుటాహుటిన వారు హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు. యువ‌తికి తీవ్రగాయాలు అయ్యాయని, హాస్పిట‌ల్‌కు తీసుకువచ్చే లోపే ఆమె మృతిచెందినట్లు సిబ్బంది వెల్ల‌డించారు. అయితే యువ‌తి మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె ప్రియుడు కనిపించకుండా అక్క‌డి నుంచి పారిపోయాడు. ఈ నేప‌థ్యంలో యువ‌తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపు ఉండటాన్ని గమనించారు. అనంతరం ఓయో హోటల్‌లో వారి గదిలోని గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు, ఖాళీ బీర్‌, విస్కీ సీసాల‌ను గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం యువ‌తి మృతదేహాన్ని ఉస్మానియా ద‌వాఖాన‌కు తరలించారు. నిందితుడు శ్రీనివాస ర‌వితేజ కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement