త్వరలోనే ‘సర్దార్ మహల్’ ప్రారంభం.. ఈ భవనం వెనుక ‘ప్రేమకథ’ ఇదే..!
Sardar Mahal | భాగ్యనగరం అంటేనే చార్మినార్( Charminar ) గుర్తొస్తుంది అందరికీ. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నెలవైన హైదరాబాద్( Hyderabad ) నగరంలో కాలు పెట్టామంటే చాలు చార్మినార్ వైపు వెళ్లాల్సిందే. అలా చార్మినార్ ముందు వాలిపోయి.. ఆ అద్భుత కట్టడానికి మంత్ర ముగ్ధులం కావాల్సిందే.. పక్కనే ఉన్న మక్కా మసీదును కూడా సందర్శించాల్సిందే.
Sardar Mahal | హైదరాబాద్ : భాగ్యనగరం అంటేనే చార్మినార్( Charminar ) గుర్తొస్తుంది అందరికీ. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నెలవైన హైదరాబాద్( Hyderabad ) నగరంలో కాలు పెట్టామంటే చాలు చార్మినార్ వైపు వెళ్లాల్సిందే. అలా చార్మినార్ ముందు వాలిపోయి.. ఆ అద్భుత కట్టడానికి మంత్ర ముగ్ధులం కావాల్సిందే.. పక్కనే ఉన్న మక్కా మసీదును కూడా సందర్శించాల్సిందే. ఇప్పుడు ఈ రెండింటితో పాటు మరో చారిత్రాక కట్టడం పర్యాటక ప్రదేశాల జాబితాలో చేరనుంది. మరి ఆ చారిత్రక ప్రదేశమే ప్రసిద్ధ చార్మినార్‌కు తూర్పు వైపున ఉన్న సర్దార్ మహల్( Sardar Mahal ). ఇది త్వరలోనే ప్రారంభం కానుంది.
కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) ఆధ్వర్యంలో ఓ ప్రయివేటు కంపెనీ ఈ పునరుద్ధరణ పనులను చేపట్టింది. సర్దార్ మహల్‌ను పునరుద్ధరించిన అనంతరం దానిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఒక ఆర్ట్ స్టూడియో, సాంస్కృతిక కేంద్రంతో పాటు ఒక చిన్న కేఫ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ పునరుద్ధరణ పనులను రూ. 30 కోట్లతో చేపట్టారు. సర్దార్ మహల్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పనులు పూర్తయి సర్దార్ మహల్ అందుబాటులోకి వస్తే.. పాత బస్తీకి మరో సరికొత్త అందం రానుంది. పర్యాటకులను ఆకర్షించనుంది.
సర్దార్ మహల్ చారిత్రక నేపథ్యం ఇదే..
సర్దార్ మహల్‌ను 1900లో నాటి నిజాంVI మీర్ మహబూబ్ అలీఖాన్ యూరోపియన్ శైలిలో నిర్మించారు. నాటి హైదరాబాద్ స్టేట్ పాలకులు మహబూబ్ అలీఖాన్ తన ప్రియమైన భార్యల్లో ఒకరైన సర్దార్ బేగం కోసం ఈ ప్యాలెస్‌ను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ సర్దార్ మహల్‌లో ఆమె నివసించడానికి నిరాకరించిందట. ఎందుకంటే సర్దార్ బేగం అంచనాలకు ఆ కట్టడం లేకపోవడమే కారణమట. అయితే ఆ చారిత్రాత్మక కట్టడంలో ఆమె నివసించనప్పటికీ.. ఆ కట్టడానికి ఆమె పేరునే నామకరణం చేశారు.. అదే సర్దార్ మహల్.
దీనిని హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) వారసత్వ భవనంగా ప్రకటించాయి. ఆస్తి పన్నులు చెల్లించకపోవడం మూలంగా జీహెచ్ఎంసీ 1965లో సర్దార్ మహల్‌ను స్వాధీనం చేసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





