త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mud House | జస్ట్ రూ.1.3 లక్షలతో మట్టి ఇల్లు.. ఆర్కిటెక్ట్ నేహా బల్లాల్ సృష్టించిన అద్భుతం

మట్టి గోడల వల్ల బయట ఉష్ణోగ్రత ఎలా ఉన్నా.. లోపల మాత్రం ఉష్ణోగ్రతను అవి క్రమబద్ధీకరిస్తాయి. అందుకే బయట ఎండ, చలి ఏది ఉన్నా.. లోపల మాత్రం హాయిగా ఉంటుంది.

J

National | Published On Dec 31, 2025, 11.30 am IST

Mud House | జస్ట్ రూ.1.3 లక్షలతో మట్టి ఇల్లు.. ఆర్కిటెక్ట్ నేహా బల్లాల్ సృష్టించిన అద్భుతం

సంక్షిప్త సారాంశం

మన తాతలు, ముత్తాతలు మట్టి ఇంట్లోనే జీవనం సాగించారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతిలో దొరికే వస్తువులతోనే అప్పట్లో ఇండ్లు కట్టుకునే వారు. అందులోనే సంతోషంగా జీవించేవారు. కానీ.. ఈ రోజుల్లో మట్టి ఇండ్లు ఎక్కడ కనిపిస్తున్నాయి. మారుమూల పల్లెల్లో కూడా సిమెంట్, ఇటుకలతో కట్టే ఇండ్లే దర్శనమిస్తున్నాయి. మట్టి ఇండ్లను మళ్లీ మనం చూడగలమా? అనే జనరేషన్‌లో ఉన్న మనం.. ఓ ఆర్కిటెక్ట్‌కి మట్టి మీద ఉన్న ప్రేమ వల్ల మట్టి ఇంటిని చూడగలుగుతున్నాం.

Advertisement

Mud House | చిన్నప్పుడు మట్టితో బొమ్మలు చేయడం అందరికీ అలవాటే కానీ.. పెద్దయ్యాక అదే మట్టి ఇల్లు కట్టుకొని ఆ మట్టి ఇంట్లో ఉంటామా? ఈరోజుల్లో అంతా కాంక్రీట్ జంగలే. ఈతరుణంలో మట్టి ఇల్లు అనేది గ్రామాల్లో కూడా మనం చూడటం లేదు. కానీ.. మట్టిపై ఉన్న ప్రేమను వృత్తిగా మార్చుకొని, పర్వతాల మధ్య అందమైన గూడును నిర్మించుకుంది ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న నేహా బల్లాల్. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న వాన్ అనే గ్రామంలో కేవలం రూ.1.3 లక్షలతో అద్భుతమైన మట్టి ఇంటిని ఆమె నిర్మించింది. ఇప్పుడు ఆమె నిర్మించిన ఆ మట్టి ఇల్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Architect Neha Ballal Builds a Mud Home in Uttarakhand for Just Rs 1.3 Lakh

ప్రకృతితో మమేకం

2021 లో ఈ ఇంటిని నిర్మించడం నేహా మొదలుపెట్టింది. కాకపోతే ఈ ఇల్లు నిర్మాణానికి కనీసం ఏడాది పట్టింది. ఈ ఇంటిని నిర్మించడానికి మట్టి, ఇసుక, గడ్డి మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించారు. పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతిలో దొరికే వస్తువులతోనే ఈ ఇంటిని నేహా నిర్మించింది.

పర్యావరణహితమైన మట్టి ఇల్లు వైపే మొగ్గు

2015 లో నేపాల్‌లో భారీ భూకంపం సంభవించిన తర్వాత అక్కడ ఇళ్లను తిరిగి నిర్మించేందుకు, భూకంపాలకు తగ్గట్టుగా ఇళ్ల డిజైన్ చేయడం కోసం నేహా అక్కడ పని చేసింది. భూకంపాలు వచ్చినా ఇండ్లకు ఎలాంటి సమస్య రాకుండా ఇట్లు భూకంపాన్ని తట్టుకునేలా ఉండేలా ఇండ్లను డిజైన్ చేయాలని ఇంటర్నెట్‌లో నేహా వెతుకుతుండగా మారుమూల గ్రామాల్లో ఉన్న మట్టి ఇళ్లపై తన చూపు పడింది. అందుకే సిమెంట్‌తో నిర్మించే ఇండ్లు కాకుండా.. నేహా మాత్రం పర్యావరణహితమైన మట్టి ఇంటిని ఎంచుకుంది.

Architect Neha Ballal Builds a Mud Home in Uttarakhand for Just Rs 1.3 Lakh

వినూత్న పద్ధతిలో నిర్మాణం

ఈ మట్టి ఇల్లు కోసం ఎర్త్‌బ్యాగ్ (Earthbag) విధానాన్ని పాటించారు. ఖాళీ సిమెంట్ సంచులలో మట్టిని నింపి వాటిని గోడలుగా పేర్చి ఆ తర్వాత ఆ మట్టి సంచులకు మట్టితో ప్లాస్టరింగ్ చేస్తారు. ఈ ఇంటిని నిర్మించేందుకు స్థానికంగా ఉన్న మేస్త్రీలను నేహా ఎంచుకుంది. కూలీలకు ఖర్చు తప్పితే ఈ ఇంటి నిర్మాణానికి నేహాకు పెద్దగా ఖర్చు కాలేదు. నిర్మాణం కోసం వాడిన ఇసుకను కూడా పక్కనే ఉన్న వాగులో నుంచి సేకరించారు.

Architect Neha Ballal Builds a Mud Home in Uttarakhand for Just Rs 1.3 Lakh

మట్టి గోడల వల్ల బయట ఉష్ణోగ్రత ఎలా ఉన్నా.. లోపల మాత్రం ఉష్ణోగ్రతను అవి క్రమబద్ధీకరిస్తాయి. అందుకే బయట ఎండ, చలి ఏది ఉన్నా.. లోపల మాత్రం హాయిగా ఉంటుంది.

ఒక బెడ్, అటాచ్డ్ టాయిలెట్, చిన్న కిచెన్.. ఇలా ఈ ఇంటిని అన్ని రకాల సౌకర్యాలతో నేహా నిర్మించుకుంది. అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. పర్యాటకులు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్లకు ఆ ఇంట్లో బస చేసే సౌకర్యాలను నేహా కల్పిస్తోంది. నగరాల నుంచి అక్కడికి వెళ్లే పర్యాటకులు చాలా మంది ఆ మట్టి ఇంట్లో బస చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Architect Neha Ballal Builds a Mud Home in Uttarakhand for Just Rs 1.3 Lakh

ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా అందమైన ఇంటిని నిర్మిచుకొని మట్టి ఇంట్లో జీవించడం అంటే ప్రకృతితో మమేకమై జీవించడమే.. ఇంతకంటే కావాల్సింది ఏంటి అని నేహా మట్టి ఇంటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement