Narsingi | నార్సింగిలో దారుణం.. ఆరేండ్ల బాలికపై లైంగిక దాడి.. హత్య
Narsingi | హైదరాబాద్‌లోని నార్సింగిలో (Narsingi) దారుణం జరిగింది. ఆరేండ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు లైంగికదాడి చేసిన అనంతరం హత్యచేశాడు. ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారి కనిపించకుండా పోయింది.
Narsingi | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని నార్సింగిలో (Narsingi) దారుణం జరిగింది. ఆరేండ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు లైంగికదాడి చేసిన అనంతరం హత్యచేశాడు. ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతికన ఆమె తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారి ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కామాంధుడు చిన్నారిని తీసుకెళ్తున్న దృష్యాలు కనిపించాయి.
చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి అతడు బాలికను తన వెంట తీసుకువెళ్లాడు. దీని ఆధారంగా గాలింపు చేపట్టిన కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు బాలికపై దారుణానికి ఒడిగట్లు తెలిపాడు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను దారుణంగా హత్య చేసినట్లు అంగీకరించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





