త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIO | నీట్ లీకేజీపై గ‌ళమెత్తిన ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్.. చార్మినార్ వ‌ద్ద ఆందోళ‌న‌

SIO | నీట్ పేప‌ర్ లీకేజీపై పాత‌బ‌స్తీలోనూ నిర‌స‌న‌ల ప‌ర్వం కొన‌సాగింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్ ఆధ్వ‌ర్యంలో చార్మినార్ వ‌ద్ద నీట్ అభ్య‌ర్థుల‌తో పాటు యువ‌త ఆందోళ‌న‌కు దిగారు.

S

Hyderabad | Published On Jul 24, 2026, 4.50 pm IST

SIO | నీట్ లీకేజీపై గ‌ళమెత్తిన ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్.. చార్మినార్ వ‌ద్ద ఆందోళ‌న‌
Advertisement

SIO | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్ లీకేజీపై పాత‌బ‌స్తీలోనూ నిర‌స‌న‌ల ప‌ర్వం కొన‌సాగింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్ ఆధ్వ‌ర్యంలో చార్మినార్ వ‌ద్ద నీట్ అభ్య‌ర్థుల‌తో పాటు యువ‌త ఆందోళ‌న‌కు దిగారు. మ‌క్కా మసీదులో శుక్రవారం ప్రార్థ‌న‌లు ముగిసిన అనంత‌రం ఈ నిర‌స‌న చేప‌ట్టారు. నిర‌స‌న‌లో భాగంగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు.

నీట్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎన్టీఎను ర‌ద్దు చేయాల‌ని నిన‌దించారు. మోదీకి భ‌యం పుట్టిన‌ప్పుడ‌ల్లా.. పోలీసుల‌ను ఉసిగొల్పుతున్నార‌ని విద్యార్థులు నినాదాలు చేశారు. జంత‌ర్ మంత‌ర్‌లో కొన‌సాగుతున్న విద్యార్థుల పోరాటానికి మ‌ద్ద‌తుగా త‌మ నిర‌స‌న కొన‌సాగుతుంద‌ని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్ స్ప‌ష్టం చేసింది. అయితే ఆందోళ‌న‌కు దిగిన విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు య‌త్నించారు. వారు ప్ర‌ద‌ర్శించిన ప్ల‌కార్డుల‌ను పోలీసులు లాగేసుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement
Advertisement