HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
HYDRAA Ranganath | సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న బండపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని, చెరువు చుట్టూ పచ్చదనం ఇంకా పెరగాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
HYDRAA Ranganath | త్రినేత్ర.న్యూస్: సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న బండపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని, చెరువు చుట్టూ పచ్చదనం ఇంకా పెరగాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
తమ్మిడికుంటలో పేరుకుపోయిన బయో వ్యర్థాలను తొలగించాం. మురుగునీటిని పూర్తిగా తొలగించి.. ఎక్కడ కూడా పాత ఆనవాళ్లు లేకుండా అభివృద్ధి చేశాం. ఇక్కడి చెరువుకు మెటల్ చార్మినార్ వైపు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే యూనిట్లున్నాయి. వీటితో చెరువుకి కాలుష్యం ముప్పు ఉంటుందని పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు కూడా ఇప్పటికే హెచ్చరించింది. వెంటనే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేర్వేరు చేసే కేంద్రాలను తొలగించాలి అని రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు కృష్ణకాంత్ పార్కును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. రెండో విడత చేపట్టిన 14 చెరువుల్లో ఒకటిగా ఉన్న కృష్ణకాంత్ పార్కు చెరువు లోతుతో పాటు విస్తీర్ణం పెరిగితే వరదను చాలావరకు కట్టడి చేయవచ్చన్నారు. ఇక్కడకు నేరుగా వరద చేరితే కృష్ణానగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలతో పాటు.. చెరువు కింద ఉన్న శ్రీనివాసనగర్, అమీర్‌పేట ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం తప్పుతుందని వివరించారు.
సంబంధిత వార్తలు

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ
సెప్టెంబర్ 5, 2026

CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ
సెప్టెంబర్ 5, 2026

MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ
- ●Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?
- ●Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ

KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ

Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?




