Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ
Khairatabad Ganesh | వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 69 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తున్నారు.
Khairatabad Ganesh | త్రినేత్ర.న్యూస్ : వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 69 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తున్నారు. పంచముఖ సంకటహర మహా గణపతిగా ఈ ఏడాది కొలువుదీరనున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు.
అయితే పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా రూపుదిద్దుకుంటున్న ఈ వినాయకుడికి రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మట్టిని వినియోగిస్తున్నారు. రాజస్థాన్‌లోని నాథద్వారా సమీపంలోని బనాస్ నది నుంచి 30 టన్నుల మట్టిని వినియోగిస్తున్నట్లు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ జీ సందీప్ రాజ్ తెలిపారు. ఈ మట్టికి స్థానికంగా లభించే 20 టన్నుల ఇసుకను కలిపి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఒడిశాకు చెందిన మట్టి విగ్రహాల నిపుణుడు జోగా రావు నేతృత్వంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 150 మంది కళాకారులు వినాయకుడి విగ్రహం తయారీలో నిమగ్నమయ్యారు. ఐదు తలలు, ఆరు చేతులు, ఒక తొండెంతో కూడిన ఈ విగ్రహానికి ఐదు తలల పాము ఆశీర్వదిస్తున్నట్లుగా రూపకల్పన చేశారు. ఈ ప్రతిమ తయారీకి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 70 మోపుల ఎండు వరి గడ్డిని కూడా తీసుకొచ్చారు. విగ్రహం తయారీకి పూర్తిగా ఆర్గానిక్ కలర్స్‌ను వినియోగిస్తున్నట్లు సందీప్ తెలిపారు. సెప్టెంబర్ 12వ తేదీ నాటికి వినాయకుడి ప్రతిమను పూర్తిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఖైరతాబాద్ గణేశ్ వివరాలివే..
- 69 అడుగుల ఎత్తు
- రాజస్థాన్ నుంచి 30 టన్నుల మట్టి సేకరణ
- 20 టన్నుల ఇసుక
- 25 టన్నుల స్టీల్
- 70 మోపుల ఎండు వరి గడ్డ
- కేవలం ఆర్గానిక్స్ కలర్స్ వినియోగం
- సెప్టెంబర్ 12 నాటికి విగ్రహం సిద్ధం
తాజావార్తలు
- ●Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?
- ●Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ
- ●CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ
- ●Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే
- ●P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్

Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!

Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ

CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ






