త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CEO Sudarshan Reddy | స‌ర్ గ‌డువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ‌

CEO Sudarshan Reddy | స‌ర్ (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గ‌డువును మ‌రోసారి పొడిగించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిషన్‌ను రాష్ట్ర ప్ర‌ధాన‌ ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి కోరారు.

S

Telangana | Published On Sep 5, 2026, 6.01 pm IST

CEO Sudarshan Reddy | స‌ర్ గ‌డువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ‌
Advertisement

CEO Sudarshan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: స‌ర్ (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గ‌డువును మ‌రోసారి పొడిగించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిషన్‌ను రాష్ట్ర ప్ర‌ధాన‌ ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి కోరారు. అభ్యంత‌రాలు, క్లెయిమ్‌ల గ‌డువు ఈనెల 16తో ముగియ‌నుండ‌గా మ‌రో మూడు వారాలు గ‌డువు పొడిగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈమేర‌కు ఆయ‌న శ‌నివారం లేఖ రాశారు. ఈ గడువును పొడిగిస్తే అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వారంలో రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితా వెలువ‌డే అవ‌కాశాలున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా శ‌నివారం వరకు 47.79 లక్షల ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చిన సమయానికి 32.39 లక్షల మంది ఓటర్లు హాజరు కాలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,74,504 మంది హియరింగ్ పూర్తి అయింది. కాగా ఇప్ప‌టికే ఓటర్ల జాబితా సవరణకు తగినంత సమయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇంతకుముందు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement